Health

ముద్దు వ్యాధి గురించి బయటకు తెలియని కొన్ని సంచలన విషయాలు.

అవును మోనో వైరస్ లు అంటువ్యాధులు. ఇవి లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరొకరికి బదిలీ అవుతాయి. అందుకే ఈ సంక్రమణను ఎక్కువగా ముద్దు వ్యాధి అని పిలుస్తారు. అయితే మోనో సంక్రమించడానికి ముద్దు ఒక్కటే మార్గం కాదు. మోనో సెక్స్ , పాత్రలు లేదా పానీయాలను పంచుకోవడంతో పాటుగా ఇతర మార్గాల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. అయితే మనకు తెలిసి చాలా వ్యాధుల పేర్లు తెలుసు. అవి ఎలా వస్తాయో కూడా చాలా మందికి తెలుసు. కొన్ని పురుగులు , కీటకాలు, దోమల వల్ల కలుగుతాయి. కాని ఇప్పుడు మీరు తెలుసుకోబేయే వ్యాధి ఎందువల్ల వస్తుందో తెలిస్తే ముఖం చిట్లిస్తారంతే.

ముద్దు వ్యాధి. ఇప్పటి వరకు ఈ వ్యాధి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇలాంటి వ్యాధి ఒకటి ఉందని కూడా వినకపోవచ్చు. అవును, కిస్సింగ్ వ్యాధి ముద్దు వల్ల వస్తుంది. మీ భాగస్వామిని ముద్దుపెట్టుకునే ముందు మీరు ఆలోచించాలి. ముద్దు పెట్టుకోవడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.అంతే కాదు ముద్దు వల్ల కలిగే వ్యాధికి మందు కూడా లేదని చెబుతున్నారు. కాబట్టి కిస్సింగ్ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు ముద్దులు ఆపేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఈ వ్యాధిని ఇప్పుడు మోనోన్యూక్లియోసిస్‌గా పిలుస్తున్నారు. మోనోన్యూక్లియోసిస్.. ఈవ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ వైరస్ పేరు ఎప్స్టీన్ బారే వైరస్. ఇది హెర్పెస్ వైరస్ కుటుంబానికి చెందినది. ఈ వైరస్ ఎలాంటి లక్షణాలు లేకుండానే రోగి శరీరంలో వ్యాపిస్తుంది. ముద్దు.. లాలాజలం, నీరు, రసం లేదా పంచుకునే పాత్రల ద్వారా వ్యాపిస్తుంది. ఒక రోగిలో వైరస్ చురుకుగా మారినప్పుడు అది మరొక వ్యక్తికి సోకుతుంది. ఇది రక్తం లేదా వీర్యంతో పరిచయం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది.

ముద్దు వ్యాధి యొక్క లక్షణాలు.. ఈ కిస్సింగ్ డిసీజ్‌ వల్ల వచ్చే వ్యాధులు విపరీతమైన అలసట, జ్వరం, గొంతు నొప్పి, తల , ఒళ్లు నొప్పులు, మెడ మరియు చంకలలో శోషరస గ్రంథులు వాపు, కాలేయం లేదా ప్లీహము వాపు, దద్దుర్లు వంటివి వస్తాయి. ముద్దు వ్యాధి నిర్ధారణ పరీక్షలు.. ఈవ్యాధిని గుర్తించడానికి రక్త పరీక్ష మరియు యాంటీబాడీ పరీక్షలు చేస్తారు. ఈ వ్యాధి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి స్వియ జాగ్రత్తలు తీసుకోవడమే ఏకైక పరిష్కారమని నిపుణుల సూచిస్తున్నారు.

మీకు జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి ఉన్నప్పుడు ముద్దు పెట్టుకోవడం మానుకోండి. కిస్సింగ్ వ్యాధికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం.. కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. హైడ్రేటెడ్ గా ఉండడం, విశ్రాంతి తీసుకోవడం మరియు నొప్పి మరియు జ్వరాన్ని తగ్గించడానికి మందులు మరియు కషాయాలను త్రాగడం చాలా ముఖ్యం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker