సంతానలేని సమస్యలను దూరం చేసే పండు ఇదే.
కివీ పండు అనేది ‘యాక్టినిడియా చైనిన్సెస్’ అనే తీగ జాతి మొక్కకు కాసే పండు. ఈ రకమైన పళ్ళను న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు. కివి పండుని ‘చైనీస్ గూస్ బెర్రీ’ అని కూడా అంటారు. ఇందుకు ప్రధాన కారణం కివీ పండులో ఆక్రోట్ ఫలం ఆకారంలో ఉండి గూస్ బెర్రీ రుచిని పోలి ఉంటాయి. అయితే ఈ రోజుల్లో చాలా మంది సంతాన లేమి సమస్యతో సతమతమవుతున్నారు. పెళ్లయి ఏడాదులు దాటుతున్నా సంతాన భాగ్యం నెరవేరడం లేదు. దీంతో ఆస్పత్రుల చుట్టు తిరుగుతూ ఏవో మందులు వాడుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
దంపతుల మధ్య సంతాన లేమి సమస్య చిక్కులు తెస్తోంది. కొన్ని జంటలు విడిపోవడానికి కూడా కారణంగా నిలుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం సంతాన లేమి సమస్యే. ఈ నేపథ్యంలో సంతాన లేమిని దూరం చేసుకునే కొన్ని చిట్కాలు పాటిస్తే మనకు దాని నుంచి విముక్తి కావడం కామనే. చాలా మంది పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఆడవారే అని నిందిస్తుంటారు. కానీ సమస్యలు మగవారిలో కూడా ఉంటాయి. మగవారిలో వీర్యకణాల సంఖ్య, వాటి కదలికలు, నాణ్యత తదితర విషయాలు ప్రధానంగా కారణాలుగా చెప్పవచ్చు.
ఆడవారిలో అయితే గర్భసంచి సమస్య ఉంటుంది. ఇంకా ఓవరీస్ లో నీటి బుడగలు ఉంటే కూడా సంతానం కాదు. ఇలా కొన్ని సమస్యలు సంతానం కలగకపోవడానికి కారణాలుగా నిలుస్తుంటాయి. మనం తీసుకునే ఆహారాలు కూడా మనకు ప్రతిబంధకాలుగా నిలుస్తాయి. బేకరీ ఫుడ్స్, ఫిజాలు, బర్గర్లు తింటే మనకు అనారోగ్యాలు వస్తాయి. కూరగాయలు, పండ్లు వంటివి తింటే ఆరోగ్యం బాగుంటుంది.
కానీ మారుతున్న జీవన శైలితో ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అందుకే సంతాన సాఫల్యం కలగడం లేదు. దీంతో జీవితంలో ఏదో కోల్పోయినట్లు భావిస్తున్నారు. సంతాన సమస్యను దూరం చేసుకుని మంచి జీవితాన్ని కల్పించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. అలవాట్లు.. మారుతున్న అలవాట్లు కూడా సంతాన సాఫల్యతను దూరం చేస్తున్నాయి. విచ్చలవిడిగా మద్యం తాగడం. ధూమపానం చేయడం వంటి చెడు అలవాట్లతో కూడా సంతానం కలగడం లేదు. కానీ ఇవి పట్టించుకోవడం లేదు.
కివి పండులో మంచి పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల అందులో ఉండే మినరల్స్, ప్రొటీన్ల వల్ల అటు ఆడవారికి ఇటు మగవారికి సంతాన సమస్యల్ని దూరం చేస్తుంది. కివి పండు సంతాన సాఫల్యతకు దోహదపడుతుంది. టెస్టోస్టిరాన్ ను ప్రేరేపిస్తుంది. ఇందులో ఉండే ఫొలేట్ వీర్య కణాల సంఖ్య పెరుగుదలక సహకరిస్తుంది. వీర్య కణాల నాణ్యతకు తోడ్పడుతుంది. పురుషుల్లో మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా కివి పండు సంతానం కలగడానికి పరోక్షంగా సహకరిస్తుంది.