News

వామ్మో, కుమారీ ఆంటీ నెలకు ఎన్ని లక్షలు సంపదిస్తుందో తెలుసా..?

కుమారీ ఆంటీ పేరు ఇప్పుడు హైదరాబాద్ ఫుడ్ బిజినెస్ లో తెగ వైరల్ అవుతోంది. ఈవిడ గురించి తెలియని ఫుడ్ లవర్ ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఆవిడ గతంలోనూ ఫేమస్సే. కాకపోతే అప్పుడు ఫుడ్ వ్లాగ్స్ చేసేవాళ్లు, ఆ ప్రాంతంలో ఉండే కార్మికులు, అప్పుడప్పుడు కొత్తగా ఫుడ్ ట్రై చేయాలి అనుకునేవాళ్లు వెళ్లి తినేవాళ్లు. కానీ, ఎప్పుడైతే మీమర్స్ ఆవిడను వైరల్ చేశారో.. ఆవిడ దగ్గర ఫుడ్ తినాలి అంటూ ఎక్కడెక్కడి నుంచో రావడం స్టార్ట్ చేశారు. అయితే ఆ వీడియోకి సంబంధించిన ట్రోల్స్ అన్నీ ఆగిపోయాయి.

ఆ తర్వాత ఆమె సంపాదనకు సంబంధించి న్యూస్ స్ప్రెడ్ చేయడం ప్రారంభించారు. మొన్నటి వరకు నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ అంకెను రూ.18 లక్షలు చేసేశారు. అదేంటి.. స్ట్రీట్ ఫుడ్ మీద అంత సంపాదన వస్తుందా? అంటూ కొత్త చర్చ కూడా ప్రారంభం అయ్యింది. అయితే ఇటీవల ఆవిడ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముందే దీనికి కూడా క్లారిటీ ఇచ్చారు. నెలకు లక్షల్లో ఆదాయం వస్తుంది అంట కదా? అంటూ ప్రశ్నించగా.. సున్నితంగా ఆవిడ ఆ వార్తలను ఖండించారు. “అందరూ ఆదాయం గురించే మాట్లాడతారు.

కానీ, ఖర్చుల గురించి ఎవరూ చెప్పరు. నాన్ వెజ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు కేజీ చికెన్ రూ.220 నుంచి రూ.240 వరకూ ఉంది. నాన్ వెజ్ లో ఏ ఐటమ్ తీసుకున్నా ధరలు విపరీతంగా ఉన్నాయి. నాకు రోజుకు రూ.60 వేల బిజినెస్ జరుగుతుంది. అందులో రూ.50 వేలు ఖర్చులకు పోతుంది. మిగిలిన రూ.పది వేలల్లో కూడా కట్టాల్సినవి ఉంటాయి. అన్నీ పోను నాకు నెలకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలు వరకు మిగులుతుంది” అంటూ ఆవిడ చెప్పుకొచ్చారు.

అయితే ఆవిడ చెప్పిన టోటల్ కౌంటర్ గురించి చెబుతూ రూ.18 లక్షలు సంపాదిస్తున్నారు అని చెప్తున్నారు. కానీ, అందులో రూ.15 లక్షలు ఖర్చులకే పోతాయి అనే విషయాన్ని మాత్రం ఎవరూ హైలెట్ చేయడం లేదు. మొత్తానికి రూ.18 లక్షలు, నెలకు రూ.3 లక్షలు అనే వార్తలపై ఒక క్లారిటీ అయితే వచ్చింది. కుమారీ ఆంటీకి నెలకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర ఆదాయం అయితే వస్తోంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker