News

హీరోయిన్ ని దారుణ హత్య చేసిన తండ్రి, దీంతో సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు.

నటనపై ఆసక్తితో చిన్నవయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది లైలా ఖాన్. రాజేష్ ఖన్నా సరసన ‘వాఫా: ఎ డెడ్లీ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో 2011లో తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లింది. ఆ తర్వాత లైలా ఖాన్ ఫ్యామిలీ కనిపించకుండా పోయింది అయితే బాలీవుడ్ హీరోయిన్ లైలా ఖాన్ ఫ్యామిలీ దారుణ హత్య సంఘటన 2011లో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్లుగా ఈ కేసుపై విచారణ కొనసాగుతుంది.

తాజాగా ఈ కేసుపై తుది తీర్పు వెలువరించింది ముంబై సెషన్స్ కోర్టు. నటి లైలా ఖాన్ దారుణ హత్య కేసులో దోషిగా తేలిన ఆమె సవతి తండ్రికి మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. హీరోయిన్ లైలా ఖాన్ తోపాటు ఆమె కుటుంబాన్ని కిడ్నాప్ చేసి దారుణంగా హాత్య చేసిన కేసు అప్పట్లో భారతీయ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసులో సుధీర్ఘ విచారణ అనంతరం 13 ఏళ్ల తర్వాత కోర్టు హత్యలకు కారణం ఆస్తి తగాదాలే అని.. ఈ కేసులో ఆమె సవతి తండ్రిని దోషిగా తేల్చి.. చివరకు మరణశిక్ష ఖరారు చేసింది.

నటనపై ఆసక్తితో చిన్నవయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది లైలా ఖాన్. రాజేష్ ఖన్నా సరసన ‘వాఫా: ఎ డెడ్లీ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో 2011లో తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లింది. ఆ తర్వాత లైలా ఖాన్ ఫ్యామిలీ కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించగా.. చాలా కాలంపాటు వారిని వెతికి చివరకు ఆమె సవతి తండ్రి పర్వేజ్ తక్ పై అనుమానం వ్యక్తం చేశారు.

అతడిని అరెస్ట్ చేసి విచారించగా.. లైలా ఖాన్ తోపాటు ఆమె కుటుంబాన్ని మొత్తం హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడు. 2011లో మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ఇగత్ పురిలో ఈ ఘటన జరిగింది. లైలా ఖాన్ తోపాటు ఆమె తల్లి షెలీనా, కజిన్స్ అజ్మీనా, జారా, ఇమ్రాన్, రేష్మాను కాల్చి చంపాడు. వారి మృతదేహాలను వారి బంగ్లాలోనే పాతిపెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన జరిగిన తొమ్మిది నెలలకు ఆమె సవతి తండ్రి పర్వేజ్ తక్ ను జమ్మూ కశ్మీర్ లో అరెస్ట్ చేశారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker