పెళ్లికి ముందే కాబోయే అత్తమామతో లావణ్య వినాయక చవితి సెలబ్రేషన్స్.

సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ ఇళ్లల్లో వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుతున్నారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వినాయక చవితి పండగను అట్టహాసంగా జరుపుకొంటున్నారు. వినాయకుడికి పూజలు చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే మెగాహీరో వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి ఏడడుగులు వేయబోతున్నాడు. రీసెంట్‌గానే పెళ్లి పనులు మొదలుపెట్టిన ఈ జంట. ఇప్పుడు కలిసి పండగ సెలబ్రేషన్స్ లోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగా ఫ్యామిలీ వినాయక చవితి.. గతేడాది కంటే చాలా గ్రాండ్‌గా జరిగింది. ఓవైపు మెగాస్టార్ చిరంజీవి మనవరాలు, రామ్‌చరణ్ కూతురు క్లీంకార.. పుట్టిన తర్వాత ఈరోజే ఇంట్లోకి అడుగుపెట్టింది. దీంతో చిరు ఫ్యామిలీ ఫుల్ హ్యాపీస్. మరోవైపు లావణ్య త్రిపాఠి.. మెగాబ్రదర్ నాగబాబు ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్‌లో పాల్గొంది.

ఆ ఫొటోల్ని వరుణ్ పోస్ట్ చేశాడు. దాదాపు ఏడేళ్లుగా వరుణ్ తేజ-లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పడ్డారు. మొన్నీమధ్యే జూన్ 9న పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు.
ఈ మధ్య పెళ్లి పనులు మొదలుపెట్టడంతో నవంబరులో పెళ్లి ఫిక్స్ అంటున్నారు. ఇప్పుడు పెళ్లికి ముందే లావణ్య.. కాబోయే అత్తారింట్లో పండగ సెలబ్రేషన్స్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.