Health

మధుమేహం వల్ల ఈ కాలంలో పాదాలకే ఎక్కువ ముప్పు, మధుమేహులూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

మారుతున్న జీవనశైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా డయాబెటిస్ వచ్చేస్తుంది. మధుమేహం వస్తుందనే దానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. వాటిని సరైన సమయానికి గుర్తిస్తే మధుమేహం ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కి ఏదైనా గాయమైతే అది మానడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అయితే వర్షాకాలం మధుమేహ వ్యాధిగ్రస్తులను ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. ఎందుకంటే తేమతో కూడిన వాతావరణం పాదాలకు సంబంధించిన అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

సరైన బూట్లు.. డయాబెటీస్ పేషెంట్లు పాదాల సంరక్షణ విషయానికొస్తే వారు సరైన బూట్లనే వేసుకోవాలి. ముఖ్యంగా సరిగ్గా సరిపోయే బూట్లునే ధరించాలి. అలాగే అవి వెడల్పుగా ఉండాలి. దీంతో మీ కాలి వేళ్లు ఇరుకుగా ఉండవు. కాన్వాస్ లేదా లెదర్ వంటి శ్వాసించే పదార్థాలతో చేసిన బూట్లు ధరించడం కూడా చాలా ముఖ్యం. ఫ్లిప్-ఫ్లాప్స్ లేదా చెప్పులను ధరించడం మానుకోండి. ఎందుకంటే ఇవి మీ పాదాలను సురక్షితంగా ఉంచవు. మీ పాదాలను క్రమం తప్పకుండా చెక్ చేయండి..ఎర్రగా, వాపు, నొప్పి, గాయం లేదా బొబ్బలు వంటివి మీ పాదాలపై అయ్యే అవకాశం ఉంది.

అందుకే మీ పాదాలను క్రమం తప్పకుండా చెక్ చేయండి. ఈ లక్షణాలలో దేనినైనా గమనించినట్టైతే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. ఈ సీజన్ లో మీ పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే తేమ చర్మంపై బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. ఇది సంక్రమణకు దారితీస్తుంది. ప్రతిరోజూ మీ పాదాలను గోరువెచ్చని నీరు, తేలికపాటి సబ్బుతో కడగండి. తర్వాత వీటిని బాగా ఎండబెట్టి, అవసరమైతే మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి.

చెప్పులు లేకుండా నడవడం మానుకోండి.. వర్షాకాలంలో చెప్పులు లేకుండా నడవడం అంత మంచిది కాదు. ఎందుకంటే నేల తడిగా, జారుడుగా ఉంటుంది. ఇది మీరు జారిపోయే, పడిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. మురికిగా ఉన్నచోట హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మీ సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే మీ ఇంటి వెలుపల ఉన్నప్పుడు కూడా బూట్లను ధరించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.. డయాబెటీస్ పేషెంట్లు పాదాల సంరక్షణలో వ్యాయామం కూడా ఒక ముఖ్యమైన భాగం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల పాదాలలో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది.

ఇది సంక్రమణ, పుండ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే వాకింగ్, ఈత లేదా సైక్లింగ్ వంటి తక్కువ ప్రభావ వ్యాయామాలు డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి. మీ రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేయండి..రక్తంలో ఎక్కువ చక్కెర స్థాయిలు పాదాలలో రక్త ప్రసరణను తగ్గిస్తాయి. ఇది పాదాలలో తిమ్మిరి, జలదరింపు వంటి అనుభూతికి దారితీస్తుంది. అందుకే మీ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేయండి. దీంతో ఏవైనా హెచ్చుతగ్గులను ముందుగానే గుర్తించి అందుకు చికిత్స తీసుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker