లీచీ పండ్లు తింటున్నారా..! మీ ప్రాణాలు పోతాయ్, జాగ్రత్త.
లీచీ పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే ద్రాక్షతో పోలిస్తే వీటిలో పాలీఫినాల్స్ శాతం అధికంగా ఉంటుంది. మృదువైన ఈ పండ్ల గుజ్జును నేరుగా తినడంతో పాటు షర్బత్ లూ, జ్యూస్ లూ, ఐస్ క్రీమ్ ల తయారీలో వాడతారు. అయితే లీచీ పండ్లను కూడా తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. స్ట్రాబెరీ రూపంలో అందంగా ఉండే లిచీ పండ్లు భలే రుచిగా ఉంటాయి.
ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎందుకంటే లీచీలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. లిచీ పండ్లలో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. మన శరీరానికి అవసరమయ్యే ఆస్కార్బిక్ ఆమ్లం (ఏబీఏ) ఇందులో లభిస్తుంది. లీచీ పండ్లను తినడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తి బలపడడం, రక్తప్రసరణ మెరుగుపడటం, జీర్ణక్రియ మెరుగుదల, గుండె జబ్బులు రాకుండా ఉండడం లాంటివి ఉన్నాయి.
కానీ లీచీ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది.లో బీపీ.. లో బీపీ సమస్య ఉంటే లీచీ పండ్లని తినకుండా ఉండాలి. ఎందుకంటే వీటిని తినడం వల్ల రక్తపోటు తగ్గడమే కాకుండా.. అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే లో బీపీ సమస్య ఉన్నవాళ్లు లీచీ పండ్లని తినడం మానేయాలి. ఫుడ్ పాయిజనింగ్.. లీచీ పండ్లని అధికంగా తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది.
కొన్నిసార్లు కడుపు నొప్పి మరియు విరేచనాలు కూడా అవొచ్చు. కాబట్టి లీచీ వినియోగానికి దూరంగా ఉండాలి. ఊబకాయం..లీచీ పండ్లలో చక్కెర అధికంగా ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య రావచ్చు. కాబట్టి లిచీని అధికంగా తీసుకోవడం మానుకోవాలి. అలెర్జీ సమస్య.. అలర్జీ సమస్య ఉన్నవారు లిచీలను ఎక్కువగా తినకూడదు.
ఎందుకంటే మీకు లిచీ పడకుంటే.. అలెర్జీ సమస్య త్వరగా వస్తుంది. కాబట్టి లిచీని అధికంగా తీసుకోవడం మానుకోవాలి. మధుమేహం.. శస్త్రచికిత్సకు ముందు 3 వారాల నుంచి లిచీలను తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే వీటిని తినడం వల్ల మధుమేహం వస్తుంది. దానిని నియంత్రించడం చాలా కష్టం. కాబట్టి లిచీని ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి.