News

మందులు వాడకుండా ఈ టిప్స్ పాటిస్తూ బీపీని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు.

రక్తపోటును నియంత్రించడానికి ప్రతిరోజూ తగినంత నిద్ర ఉండాలి. మన గుండె, రక్త ధమనులు ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోవడం గుండె జబ్బులు, అధిక రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ప్రతి మనిషి సాధారణ బీపీ 120/80 mmHg వరకు ఉంటుంది. బీపీ స్థాయి అంతకు మించితే, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బీపీ పెరిగినట్లయితే.. శరీరంలో కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. బాడీ పెయిన్స్, తలనొప్పి, చూపు మందగించడం వంటి లక్షణాలు కళ్లలో కనిపిస్తాయి.

శారీరక, మానసిక ఒత్తిడి, అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయి భారీగా పెరుగుతుంది. దీని వల్ల గుండె, మెదడు, కిడ్నీలు ప్రమాదంలో పడుతాయి. హైబీపీని నియంత్రించాలనుకుంటే.. బీపీని క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల బీపీ ఏ స్థాయిలో ఉందో మనకు తెలుస్తుంది. అయితే, హైబీపీని సైతం మెడిసిన్ వాడకుండా, సులభమైన పద్ధతుల్లో తగ్గించుకునే పద్ధతులు ఉన్నాయి.

ఆ పద్ధతల ద్వారా బీపీని సులభంగా నియంత్రించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. లోతైన శ్వాస..బీపీ ఎక్కువగా ఉన్నప్పుడుు నరాలు బలహీనత, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు మొదలవుతాయి. బీపీని నియంత్రించడానికి లోతైన శ్వాస తీసుకోవాలి. దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని రెండు సెకన్ల పాటు శ్వాసన బిగపట్టుకోవాలి. ఆ తరువాత శ్వాస వదలాలి. ఇలా దీర్ఘంగా శ్వాస తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది.

గోరు వెచ్చని నీటితో స్నానం..బీపీ ఎక్కువగా అనిపిస్తే గోరువెచ్చని నీటితో స్నానం చేసి విశ్రాంతి తీసుకోవాలి. అలసట, ఒత్తిడి.. బీపీ పెరగడానికి అతి పెద్ద కారణం. గోరువెచ్చని నీటితో స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటే ఒత్తిడి తగ్గి బీపీ కూడా నార్మల్‌గా ఉంటుంది. బరువు అదుపులో ఉంచుకోవాలి..బీపీ ఎక్కువగా ఉంటే బరువును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. పెరుగుతున్న బరువు కారణంగా శ్వాస తీసుకోవడం కష్టతరం అవుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది.

బరువును తగ్గించుకోవడం ద్వారా బీపీని కూడా నియంత్రించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం..బీపీని నియంత్రించడంలో డైట్ కీలక పాత్ర పోషిస్తుంది. మీ BP ఎక్కువగా ఉన్నట్లయితే, ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను తీసుకోవాలి. బీపీ అదుపులో ఉండాలంటే ఆహారంలో ఉప్పును తగ్గించాలి. కెఫిన్ నియంత్రణ..బిపిని నియంత్రించాలనుకుంటే, కెఫిన్ తీసుకోవడం పరిమితం చేయాలి. టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker