News

సొంతంగా విమానంతోపాటు.. మహేశ్ బాబు ఆస్తులు ఎంతో తెలిస్తే..?

మహేష్ బాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించాడు. దీంతో పాటు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల శస్త్రచికిత్సకు ఆయన సహకారం అందుతోంది. ఇప్పటికే వెయ్యి మంది చిన్నారులకు పైగా హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. అయితే అలాగే హైదరాబాద్ గచ్చిబౌలిలో సెవెన్ స్క్రీన్ మల్టీప్లెక్స్, ఏఎమ్బీ సినిమాస్ కూడా ఉన్నాయి.

అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. రెయిన్ బో ఆసుపత్రులకు గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్నారు. సీఎన్బీసీ నివేదిక ప్రకారం.. మహేష్ ఆస్తుల విలువ రూ. 273 కోట్లుగా అంచనా వేయబడింది. అలాగే నెలకు రూ. 2 కోట్లు.. సంవత్సరానికి రూ. 120 కోట్లు వరకు సంపాదిస్తాడని తెలుస్తోంది. ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ నివేదిక ప్రకారం.. గుంటూరు కారం సినిమాకు మహేష్ రూ.78 కోట్లు పారితోషికం తీసుకున్నారట.

అలాగే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ చేసే సినిమాకు దాదాపు రూ. 125 కోట్లు రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు తెలుస్తోంది. సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా సంపాదిస్తున్నారు. ప్రతి బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం రూ. 10 కోట్లు వసూలు చేస్తాడని తెలుస్తోంది. 2022లో మహేష్ నికర విలువ రూ. 220 కోట్లు. 2015లో కేవలం 90 కోట్లు మాత్రమే అని సమాచారం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన భవనం ఉంది. ఆ ఇంటి విలువ రూ. 28 కోట్లు. అలాగే బెంగుళూరులోనూ ఒక విలాసవంతమైన భవనం ఉంది.

మహేష్ బాబుకు కార్లంటే అమితమైన ఇష్టం. చిన్న వయసు నుంచి అతడి గ్యారేజీలో అనేక కార్లను చేర్చుకున్నారు. ఆడి ఇ-ట్రాన్, రేంజ్ రోవర్, BMW X6, Mercedes -Benz S-క్లాస్ వంటి విలాసవంతమైన మోడల్‌లు ఉన్నాయి. మహేష్ బాబు ఇటీవల లెక్సస్ ఎల్ఎక్స్ 570ని కూడా కొనుగోలు చేశారు. అలాగే ప్రైవేట్ విమానం, విలాసవంతమైన వ్యానిటీ వ్యాన్ ఉంది. ప్రొడక్షన్ హౌస్, మల్టీప్లెక్స్‌, ఏఎన్ రెస్టారెంట్ కూడా ఉన్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker