సూపర్‌స్టార్ మహేష్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..?
మహేష్ బాబుతో పాటుగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ ఈవెంట్ హాజరయ్యారు. హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అలాగే ఈ ఈవెంట్ కు పెద్దెత్తున స్టూడెంట్స్ హాజరయ్యారు. ఇదిలా ఉంటే యానిమల్ ఈవెంట్ కు మహేష్ బాబు చాలా క్యాజివాల్ లుక్ లో వచ్చారు. అయితే తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ను కలిశారు. వరుస విజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ దూకుడు మీద ఉంది.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి. ఇలా ఒక్కొక్కరూ తమ బ్యాట్లతో పరుగుల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాప్ టీమ్స్‌ను చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్ నెక్స్ట్ ఆర్సీబీతో సొంతగడ్డపై మ్యాచ్‌కు రెడీ అయి పోయింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న ఆరెంజ్ ఆర్మీ సోమవారం సూపర్‌స్టార్ మహేష్ బాబును ఒక యాడ్ షూట్ లో కలిసింది. ఈ సందర్భంగా మహేష్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ టాలీవుడ్ ప్రిన్స్‌తో సరదాగా కాసేపు గడిపా అని ఆ పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీనికి మహేష్ రిప్లయ్ ఇచ్చాడు. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్నాడు.. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ ఫొటోలలో వైరల్ అయిన మహేష్ బాబు షర్ట్ ధర గురించి చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం మేరకు మహేష్ బాబు ధరించిన షర్ట్ ధర అక్షరాలా 1,15,023 రూపాయలు. అంటే లక్షా పదిహేను వేల ఇరవై మూడు రూపాయలు. ఇక ఆ షర్ట్ బ్రాండ్ పేరు బ్రూనెల్లో కుసినెల్లి. ఇక ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.