Health

మలేరియా దోమ కుడితే శరీరంలో జరిగే మార్పులు ఏంటో తెలుసా..?

ప్రపంచంలోని సగం జనాభా ఇంకా మలేరియా ముప్పును ఎదుర్కొంటోంది. ఏటా 4 లక్షల మందికిపైగా ప్రజలను బలి తీసుకుంటున్న ఈ వ్యాధి దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులను ఈ వ్యాధి ఎక్కువగా పొట్టనబెట్టుకుంటోంది. ఒక్క ఆఫ్రికాలోనే ఏటా 2.5 లక్షల మంది చిన్నారులు ఏటీ ఈ వ్యాధి కారణంగా బలవుతున్నారు. అయితే మలేరియా అనేది ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపించే వ్యాధి. ఈ దోమ ప్లాస్మోడియం వైవాక్స్ అనే వైరస్‌ను వ్యాప్తిచేస్తుంది.

దాని కాటు తర్వాత వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీంతో మలేరియా లక్షణాలు శరీరంలో కనిపించడం ప్రారంభమవుతాయి. మలేరియా సమయంలో శరీరంలో ఏమి జరుగుతుందో అందరికీ తెలుసు, అయితే మలేరియా తగ్గిన తర్వాత శరీరంలో ఏమి జరుగుతుందో చాలా మందికి తెలియదు. మలేరియా తర్వాత శరీరంలో కలిగే నష్టాలు .. బలహీనత ఉండటం.. మలేరియా సమయంలో శరీరంలో ఎర్ర రక్త కణాలు కోల్పోతారు. దీని కారణంగా, శరీరం రక్తహీనత స్థితికి వెళ్లిపోతుంది.

దీని కారణంగా, చాలా మంది బలహీనత, దీర్ఘకాలిక అలసట, కండరాల నొప్పితో సహా వెన్నునొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లీహము దెబ్బతింటుంది.. ప్లీహము, శోషరస వ్యవస్థలో భాగమైన ఒక అవయవం. ప్లీహము రక్తాన్ని ఫిల్టర్ చేసే లింఫోసైట్‌లను తయారు చేస్తుంది. రక్త కణజాలాలను నిల్వ చేస్తుంది.

మలేరియా వచ్చినప్పుడు, పాత రక్తనాళాలు నాశనమవుతాయి. ప్లీహము క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇది శరీరంలో రక్త శుద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది.. మలేరియా వచ్చిన తర్వాత రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. శరీరం తనను తాను సరిగ్గా రిపేర్ చేసుకోలేదు. అందుకే మలేరియా వచ్చిన కొన్ని రోజుల తర్వాత కూడా అనారోగ్యానికి గురవుతారు.

అంతేకాకుండా మలేరియా వచ్చిన తర్వాత, శరీరంలో వివిధ అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి, మలేరియా వ్యాధి దరి చేరకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ఇందుకు ముందస్తుగా ఇంట్లో దోమలు రాకుండా చూసుకోవాలి. తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలి. అలాగే మలేరియా వచ్చిన తగ్గిపోయిన తరువాత తర్వాత అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోండి. ఈ వ్యాధి కారణంగా ఎదురయ్యే ఆరోగ్యసమస్యలను సులభంగా నివారించడానికి ప్రయత్నించండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker