News

మొదటి రాత్రి మల్లెపూలు పెట్టేది మూడ్ కోసం కాదు, అసలు విషయం అసలు విషయమేంటంటే..?

రోజంతా శారీరక కష్టంతో అలసి పోయిన శరీరాన్ని సేదతీర్చి, మనసంతా ఆహ్లాదాన్ని నింపి, మధురాను భూతులను పంచే మల్లెల గుబాళింపుల నడుమ హాయిగా కునుకు పట్టేస్తుంది. ప్రతిరోజూ మల్లెపూలను తలలో పెట్టుకోవటం వల్ల ఆహ్లాదంగా వుండడమే కాదు, కళ్లకూ మేలు చేస్తాయి. అయితే ఆడవాళ్లు ఏ పూలు పెట్టుకున్నా గానీ మంచిదే. అయితే మల్లెపూలు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెళ్ళైన ఆడవారు భర్తలను తమవైపు ఆకర్షించడానికే మల్లెపూలు పెట్టుకుంటారని.. సినిమాల్లో గానీ, బయట సమాజంలో గానీ చిత్రీకరిస్తూ వచ్చారు.

నిజానికి మల్లెపూలు పెట్టుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలు వేరే. మల్లెపూలు పెట్టుకోవడం అంటే ఆయుర్వేద సాధన అని చెబుతారు. ఫస్ట్ నైట్ సమయంలో మల్లెపూల వల్ల ప్రయోజనాలు:- మొదటి రాత్రి అప్పుడు దంపతుల మధ్య బంధం బలపడేందుకు మల్లెపూలు బాగా సహకరిస్తాయి. మల్లెపూల వాసన మెదడుని ప్రశాంతంగా ఉంచుతుంది. పడక గదిలో మంచం మీద ఉన్నప్పుడు టెన్షన్ ని దూరం చేస్తుంది. సిగ్గు, భయాన్ని తొలగిస్తుంది. వెంటనే స్కలనం కాకుండా ఉంటుంది. బెడ్ మీద మల్లెపూలు చల్లడం వల్ల.. ఆ సువాసనను దంపతులు పీల్చడం వల్ల ప్రశాంతంగా ఉండడమే కాక ఉత్తేజంగా, ఆనందంగా ఉంటారు.

మల్లెపూల వల్ల భార్యకు, భర్తకు ఇద్దరికీ ప్రయోజనమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫస్ట్ నైట్ లోనే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు:- సాంప్రదాయ పరంగా, మతపరంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ఔషధ పరంగా మల్లెపూల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందానికి, ఆనందానికి, గాఢమైన ఆప్యాయతకు, పొందికకు చిహ్నంగా ఈ మల్లెపూలను పరిగణిస్తారు. అయితే ఈ మల్లెపూలను ఎక్కువగా చనుబాలు ఇచ్చే స్త్రీలు ధరించేవారు. ఈ స్త్రీలు మల్లెపూలను తలలో పెట్టుకోవడం వల్ల బిడ్డకు కావాల్సిన పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.

దీని వల్ల లాక్టేషనల్ అమెనోరియా పెరగడమే కాకుండా.. పాల ఉత్పత్తికి కావాల్సిన గాలాక్టోపోయిసిస్ స్థాయి పెరుగుతుంది. అలానే ఈ మల్లెపూలు ధరించడం వల్ల చల్లగా ఉంటుంది. మల్లెపూలు పుర్రె వేడిని జుట్టు ద్వారా గ్రహించి.. బయటకు పంపించేస్తాయి. చల్లదనం కోసం మల్లెపూలు ధరించేవారు. పూర్వం మగాళ్లు కూడా మల్లెపూలు ధరించేవారట. అప్పట్లో వారి జుట్టు పొడవుగా ఉండేదట. అయితే ఫ్యాషన్ కారణంగా మగాళ్లు మల్లెపూలు పెట్టుకోవడం మానేశారు.

ఈ మల్లెపూల వాసనకు నిద్రలేమి సమస్య తగ్గుతుందని.. మెడిసిన్ లా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మల్లెపూల వాసనకు మత్తు కలుగుతుంది. అతి కోపాన్ని తగ్గించే గుణం మల్లెపూలలో ఉన్నాయని చెబుతున్నారు. చిరాకు, కోపం వంటి వాటిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. అలానే స్త్రీలలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. మరీ ముఖ్యంగా.. దంపతుల మధ్య బంధం బలంగా ఉండడంలో మల్లెపూలు సహకరిస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker