News

అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ, అసలు ఏం జరిగిందంటే..?

సింగర్ మంగ్లీ రోడ్డు ప్రమాదానికి గురైంది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. యాక్సిడెంట్ లో మంగ్లీ ప్రయాణించిన కారు డ్యామేజ్ అయింది. అయితే ప్రముఖ గాయని మంగ్లీ కి పెను ప్రమాదం తప్పింది.. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం వాహనం ఢీ కొట్టింది కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

ప్రముఖ గాయని మంగ్లీ కు ప్రమాదం తప్పింది రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన శంషాబాద్ తొండుపల్లి సమీపంలో చోటుచేసుకుంది.

కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీ తిరిగి బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ అర్ధరాత్రి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. తొండపల్లి సమీపంలో రాగానే మంగ్లీ కారణం ఓ డీసీఎం వాహనం వెనుక నుండి వచ్చి ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న మేఘరాజ్ ,మనోహర్ లతో సహా మంగ్లీ ఉన్నారు.

ఈ ముగ్గురికి స్వల్ప గాయాలు అవ్వగా డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం… ఇకపోతే మంగ్లీ ఓ ప్రముఖ సింగింగ్ షోలో హోస్టుగా మరోవైపు సినిమాలో పాటలను పాడుతూ ఉన్నారు. మంగ్లీకి ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker