News

పెళ్లైన గంటలోనే నవ వధువు మృతి, శోక‌సంద్రంలో కుటుంబ స‌భ్యులు, కారణం ఏంటంటే..?

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా మ‌క్కువ మండ‌లం ద‌బ్బ‌గ‌డ్డ గ్రామానికి చెందిన న‌వ వ‌ధువు అఖిల‌(20)కు శుక్ర‌వారం రాత్రి 10 గంట‌ల‌కు వివాహ‌మైంది. ఇక కుటుంబ స‌భ్యులంద‌రూ అంద‌రూ వెళ్లిపోయారు. పెళ్లి ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత నీర‌సంగా ఉంద‌ని చెప్పి అఖిల నిద్ర‌లోకి జారుకుంది. కాసేప‌టికి ఆమెను బంధువులు పిలిచారు. కానీ స్పందించ‌లేదు. దీంతో కుటుంబ స‌భ్యులు హుటాహుటిన మ‌క్కువ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి త‌ర‌లించారు.

పూర్తీ వివరాలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లా దబ్బగడ్డ గ్రామంలో పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పార్వతీపురం కు చెందిన వెత్స అఖిలకు, దెబ్బగడ్డ గ్రామానికి చెందిన భాస్కర్ రావు తో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో అంగరంగ వైభవంగా పెళ్లైంది. వివాహానికి వచ్చిన ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, స్నేహితులతో పెళ్లి మండపం ఎంతో కోలాహలంగా మారింది. పాటలు, డ్యాన్సులతో అంతా అక్కడి వాతావరణం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది.

అయితే అర్ధరాత్రి వరకు సాగిన పెళ్లి తంతు ముగిసిన తర్వాత తనకు కళ్లు తిరుగుతున్నాయని.. నీరసంగా ఉందని చెప్పి నిద్రలోకి జారుకుంది. కుటుంబ సభ్యులు ఎంత లేపినా లేవకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే మక్కువ పీహెచ్ సీకి తరలించారు. అప్పటికే అఖిల పరిస్థితి క్షీణించడంతో వెంటనే సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అఖిల మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలిసి పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయారు.

అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న తమ కూతురు గంటల వ్యవధిలోనే కానరాని లోకానికి వెళ్లడంతో అఖిల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అఖిల మృతి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker