మగవారికే ఎందుకు బట్టతల వస్తుందో తెలుసా..?

జుట్టు ఎక్కువగా రాలడం, బట్టతల వంటి సమస్యలు తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రధానంగా వయస్సు ప్రభావం, జన్యుపరమైన కారణాలు, పోషక లోపాలు, జీవనశైలి అలవాట్లు, స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్లు, దీర్ఘకాలికమైన ఒత్తిడి, మందుల వాడకం కారణాలు ఉంటాయి. స్త్రీ, పురుషులిద్దరికీ బట్టతల సమస్యలు ఉంటాయి, అయితే ఇది పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా పురుషులలో ఒక ప్యాచ్ లాగా బట్టతల ఏర్పడుతుంది.
అయితే చాలా మంది పురుషులు బట్టతల సమస్యతో బాధ పడుతూ ఉంటారు బట్టతల ఉంటే పెళ్లి కూడా ఎవరూ చేసుకోవడానికి ఇష్ట పడరు. వయసు పెరిగే కొద్ది బట్టతల సమస్య మగవాళ్ళల్లో ఎక్కువవుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా మీకు సందేహం కలిగిందా.. బట్టతల ఎందుకు మగవాళ్ళకే వస్తుంది.

మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరే జుట్టు రాలుతూ ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది ఎవరికైనా ఉంటుంది, మగవాళ్ళకి జుట్టు రాలిపోతుంది ఆడవాళ్ళకి రాలేదు అనుకుంటే అది పొరపాటు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ కూడా జుట్టు రాలుతుంది. అయితే మగవాళ్ళకి బట్టతల రావడానికి కారణం టెస్టోస్టెరీన్. దీని వల్లే బట్టతల మగవాళ్ళకి వస్తుంది.

టెస్టోస్టెరీన్ డిహైడ్రో టెస్టోస్టెరీన్ కింద మారతాయి అప్పుడు జుట్టు ఎదుగుదల ఆగుతుంది జుట్టు ఎదుగుదలకి అంతరాయం వస్తుంది. జుట్టు సన్నగా అయిపోవడమే కాదు హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. జుట్టు బ్రేక్ అయిపోతుంది ఎదగదు కూడా. అందుకనే మగవాళ్లలో బట్టతల వస్తుంది. అలానే థైరాయిడ్ హార్మోన్స్ లో హెచ్చుతగ్గులు జెనెటిక్స్ వయసు వలన కూడా జుట్టు రాలుతూ ఉంటుంది.

కానీ బట్టతల కేవలం మగవాళ్ళకే రావడం వెనక కారణం అయితే టెస్టోస్టెరీన్ ఏ. జుట్టు ఎదుగుదల మన ఆహారం బట్టి కూడా ఉంటుంది. మంచి పోషకాహారణ తీసుకుంటే జుట్టు బాగా ఎదుగుతుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. దానితో పాటుగా నిద్ర వ్యాయామం నీళ్లు ఇవన్నీ కూడా మన ఆరోగ్యం పై ఎంతో ప్రభావం చూపిస్తాయి.