Health

పురుషుల్లో సంతానలేమి సమస్య ఉందని ముందుగానే ఈ లక్షణాల ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.

భారతదేశంలో సంతానలేమికి సంబంధించిన కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. పునరుత్పత్తి వ్యవస్థలో లోపాలు మగ లేదా ఆడవారిలో సంతానలేమికి దారితీస్తోంది. సంబంధిత కారణాలను ఇక్కడ తెలుసుకోండి. మీకు ఏవైనా సమస్యలు ఉంటే సంతానోత్పత్తికి సంబంధించిన వైద్య నిపుణుడిని సంప్రదించండి. అయితే పురుషులకు సంతానలేమి సమస్య వచ్చిన తర్వాత దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే పునరుత్పత్తి అవకాశాలు తొలగిపోతాయి.

అయితే సంతానలేమి సమస్య ఉందో? లేదో? ఎలా గుర్తించాలో చాలా మందికి తెలియదు. ఇదే సమస్యను మరింత పెద్దది చేస్తుంది. అయితే సంతానలేమి సమస్య ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. సంతానలేమి సమస్య ఉన్నవారిలో అంగస్తంభన లోపం ఉంటుంది. ఇది ప్రధాన లక్షణం కూడా. అంగస్తంభన లోపం, అంగస్తంభన సమయం తగ్గడం వంటి సమస్యలను తరచుగా ఎదుర్కొంటున్నట్టైతే మీరు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. వృషణాలలో కనిపించే మార్పులు, అసౌకర్యం, నొప్పి వంటి లక్షణాలను కూడా దాచకూడదు.

ఎందుకంటే ఇవి వంధ్యత్వంతో సంబంధం కలిగి ఉండొచ్చంటున్నారు నిపుణులు. అలాగే వీర్యకణాల పరిమాణం, నాణ్యత, స్వభావం, వీర్యంలోని రక్త పరిమాణంలో వ్యత్యాసం కనిపిస్తే తప్పనిసరిగా హాస్పటల్ కు వెళ్లాలి. హార్మోన్ల సమస్యలున్న పురుషుల ముఖం, ఇతర శరీర భాగాలపై జుట్టు పెరుగుదల తక్కువగా ఉంటుంది. ఇది కూడా సంతానలేమికి ఒక సంకేతం. కానీ ముఖం లేదా శరీర భాగాలపై తక్కువ జుట్టు పెరుగుదల ఉన్న పురుషులందరికీ వంధ్యత్వం ఉండదు.

సంతానలేమికి కారణాలు.. వంధ్యత్వం ప్రధానంగా మహిళలకు వచ్చిన మాదిరిగానే హార్మోన్ల సమస్యల వల్ల వస్తుంది. వీటితో పాటుగా పునరుత్పత్తి వ్యవస్థలోని అవయవాల సమస్యలు, సంతానోత్పత్తి సమస్యలు, స్మోకింగ్, ఆల్కహాల్, లేదా ఇతర పదార్ధాల వాడకం వంటి పేలవమైన జీవనశైలి, ఒత్తిడి, మధుమేహం, హై బీపీ, లైంగిక సంక్రమణ వ్యాధులు వంటి వ్యాధుల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

సంతానలేమి సమస్య నుంచి ఎలా బయటపడాలంటే.. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. కంటినిండా నిద్రపోవాలి. అలాగే మీ భాగస్వామితో సంతోషకరమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే వంధ్యత్వ సమస్యను కొంతవరకు నివారించొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker