Health

బెడ్‌రూమ్‌లో మగజాతి ఆణిముత్యాలు అస్సలు చేయకూడని పనులు ఇవే.

వాళ్లూ వీళ్లూ చెప్పే మాటల ఆధారంగా కాకుండా మీ భాగస్వామి వేరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్న విషయంలో ఉన్న నిజా నిజాలను మీ అంతట మీరే స్వయంగా ధృవీకరించుకోవాలి. వంద శాతం అది నిజమని అనుకున్నప్పుడు మాత్రమే తర్వాత ఏంటి అనే దాన్ని ఆలోచించాలి. అయితే రెండు వైపులా ప్రేమ, నమ్మకం, గౌరవం, ఆసక్తి ఉంటేనే సెక్స్ జీవితం సజీవంగా ఉంటుంది. లైంగిక జీవితంలో సమస్యలకు అనేక కారణాలు ఉన్నాయి. సంతోషకరమైన లైంగిక జీవితాన్ని గడపడానికి చిన్న విషయాలపైనా శ్రద్ధ వహించాలి. మొదట్లో చిన్న సమస్య అయినా రానురాను పెద్ద సమస్యగా మారుతుంది.

మీ వివాహానికి ఆటంకం కలిగించే బెడ్‌రూమ్‌లో మీరు చేస్తున్న కొన్ని తప్పులు ఇక్కడ ఉన్నాయి. చాలామంది మహిళలకు బెడ్‌రూమ్‌లో లైట్‌ నచ్చదు. చీకటిలో సెక్స్ చేయాలనే ఎక్కువమంది మహిళలు అనుకుంటారు. సాధారణంగా మహిళలు ఇలానే ఇష్టపడతారు. పురుషులు కాంతిలో సెక్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ సందర్భంలో మీకు లైట్ కావాలి, కానీ మీ భాగస్వామికి అలా నచ్చదు. ఇది ఇద్దరి మధ్య విభేదాలకు దారితీయవచ్చు. మీరు మీ భాగస్వామి ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండటం ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించినప్పుడే వివాహబంధం బలపడుతుంది.

వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి ఒక్కరికీ ముఖ్యమైనది. ఇది ఇన్ఫెక్షన్ నుండి మిమ్మల్ని రక్షించడమే కాకుండా మీ సెక్స్ జీవితంలో ఆనందాన్ని తీసుకురావడానికి కూడా సహాయపడుతుంది. సంభోగానికి ముందు ప్రైవేట్ భాగాలను శుభ్రం చేసుకోండి. గోళ్లను కూడా కత్తిరించుకోవాలి. మీ పొడవాటి గోర్లు మీ భాగస్వామి శరీరానికి హాని కలిగిస్తాయి. ప్రైవేట్ భాగాల నుండి వచ్చే దుర్వాసన భాగస్వామి మానసిక స్థితిని పాడు చేస్తుంది. శుభ్రంగా ఉండండి. సెక్స్‌కు ముందు డర్టీ టాక్ తప్పనిసరి అంటున్నారు నిపుణులు. కానీ అది ఎక్కువగా చేయడం మంచిది కాదు.

శారీరక సంబంధం మెుదట్లో సరైన మాటలు ముఖ్యం. అయితే మీరు మొత్తం అలానే మాట్లాడుతున్నట్లయితే, అది మీ భాగస్వామికి నచ్చకపోవచ్చు. మీ భాగస్వామితో ఒంటరిగా ఉన్నప్పుడు మాజీ లవర్ జ్ఞాపకాలు అనవసరం. ఇది సంబంధాన్ని నాశనం చేస్తుంది. శారీరకంగా పాల్గొన్నప్పుడు కూడా మీ మాజీల గురించి మాట్లాడకండి. భార్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీ భాగస్వామి సంతోషంగా ఉండాలంటే ముందుగా మీరు సంతోషంగా ఉండాలి. ఆమెతో అలా చేసేవాన్ని.. అని అంటే.. ఇక మీ పని ఖతమ్ అయిపోయినట్టే. చాలామంది పురుషులు.. సెక్స్ సమయంలో కూడా తమ ఫోన్‌లను చూస్తారు.

సెక్స్ చేస్తూనే ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునే వారూ ఉన్నారు. ఇది మీ భాగస్వామి ఆనందాన్ని, మానసిక స్థితిని పాడు చేస్తుంది. శారీరక సంబంధంలో పాల్గొనే ముందు గాడ్జెట్‌కు దూరంగా ఉండండి. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఇది ఆ క్షణాన్ని ఆస్వాదించడానికి, మీ భాగస్వామిని తెలుసుకోవడంలో సహాయపడుతుంది. మీరు ఫోన్‌లో మాట్లాడుతూ.. సెక్స్ చేస్తే.. మెకానికల్ అవుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker