News

తల్లి కాబోతున్న సింగర్ సునీత..? ఈ వయసులో ఊహించని ట్విస్ట్.

సింగర్ సునీతకు తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం సునీత సొంతం. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా సునీతకు మంచి గుర్తింపు ఉంది. ఇక సునీత వ్యక్తిగత జీవితానికి వస్తే..వేధింపులకు గురి చేస్తున్నారనే కారణంతో తన మొదటి భర్తకు సునీత విడాకులిచ్చారు.

తన మొదటి భర్తతో ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. మొదటి భర్తతో విడిపోయిన తరువాత సునీత కొంతకాలం సింగిల్‌గా జీవించారు. అయితే 2020 లాక్ డౌన్ సమయంలో రామ్ వీరపనేని ఆమెకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడట. కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం చెబుతానని సునీత అన్నారట. పేరెంట్స్ తో పాటు పిల్లలు కూడా ఒప్పుకోవడంతో రామ్ వీరపనేని ని ఆమె వివాహం చేసుకుంది.

కాగా సునీత గర్భవతి అయ్యారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రామ్ వీరపనేని తండ్రి కాబోతున్నాడని ఓ వార్త హల్చల్ చేస్తుంది. ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ.. ప్రముఖంగా వినిపిస్తుంది. కాగా సునీత కుమారుడు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆయన నటించిన సర్కారు నౌకరి గత ఏడాది విడుదలైంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ట్ తెరకెక్కిన సర్కారు నౌకరి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సినిమా బాగుందని పలువురు ప్రశంసించారు. ఐతే కమర్షియల్ గా ఆడలేదు. రామ్ వీరపనేనితో వివాహం తర్వాత సునీత జీవితం మారిపోయింది. ఆమెకు ఎలాంటి ఆర్థిక డబ్బందులు లేవు. హ్యాపీగా జీవితం గడుపుతుంది. తన ఇద్దరు పిల్లల భవిష్యత్ బాధ్యతలు కూడా రామ్ వీరపనేని తీసుకున్నాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker