Health

మీ నోట్లో ఈ స‌మ‌స్య ఉంటే.. మీ గుండె ఎంత ప్రమాదంలో ఉందొ తెలుసుకోండి.

మన నోటి దుర్వాసన వస్తుండడంతో మనలోని ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాక మన నోటి దుర్వాసన రావడం వల్ల నలుగురుతో మాట్లాడటానికి చాలా వరకు ఇష్టపడక, అవాయిడ్ చేస్తూ ఉంటాం. దానికి తోడు పక్కవారు కూడా మనతో మాట్లాడేందుకు సహసించరు. అయితే మనం ఎలా అయితే మన ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తామో, అలానే పంటి ఆరోగ్యంపై కూడా కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి.

పళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని చిట్కాలను కచ్చితంగా పాటించాలి. మన పళ్ళు బాగుంటే మన నవ్వు బాగుంటుంది. మరి నవ్వు బాగుంటే మనం అందంగా కనిపిస్తాం. అలాగే పళ్ళు కనుక పాడైతే కచ్చితంగా డెంటిస్టుల‌ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. పైగా ఎక్కువ శ్రమతో కూడుకున్నది. ప్రతి రోజు కూడా శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి.

సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వలన బ్యాక్టీరియా నోట్లో తయారవుతుంది. గుండె సంబంధిత జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి సమస్యలని తీసుకువస్తుంది. కాబట్టి క‌చ్చితంగా పళ్ళు శుభ్రంగా తోముకోవాల‌ని డెంటిస్టులు అంటున్నారు. అయితే బ్రష్ చేసుకునే విషయంలో చాలామందికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు మీకు కూడా ఉన్నట్లయితే వెంటనే క్లియర్ చేసుకోండి.

చాలామంది పళ్ళు తోముకోకుండా కేవలం మౌత్ వాష్ ని ఉపయోగిస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ముందు బ్రష్ చేసుకుని, ఆ తర్వాత మీరు మౌత్ వాష్ ని ఉపయోగించవచ్చు. అలానే పళ్ళు తోముకునేటప్పుడు బ్రష్ మరీ గట్టిగా మరీ మెత్తగా ఉండే దానిని ఉపయోగించకూడదు. మధ్యస్తంగా ఉండే దానిని ఉపయోగించాలి. బాగా ఎక్కువ ఒత్తిడి పెట్టి బ్రష్ చేయడం కూడా మంచిది కాదు.

సున్నితంగా బ్రష్ చేసుకోవాలి. రెండు, మూడు నిమిషాల పాటు ప్రతి రోజూ బ్రష్ చేసుకోవాలి. అలాగే రోజుకి ఒకసారి కంటే ఎక్కువ సార్లు బ్రష్ చేసుకోవచ్చు. అప్పుడే పళ్ళు బాగుంటాయి. ప్రతిరోజు ఉదయం బ్రష్ చేసుకోవాలి. అలానే మళ్లీ రాత్రి కూడా బ్రష్ చేసుకోవాలి. ఏదైనా దంత సమస్యలు కలిగినట్లయితే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker