News

చనిపోయే గంట ముందు MS నారాయణ బ్రహ్మానందానికి చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు.

ఒకప్పుడు ఎమ్మెస్ నారాయణ లేని తెలుగు సినిమా ఉండేది కాదు. కెరీర్ మంచి స్టేజీలో ఉన్నపుడే ఈయన మరణించాడు. దాంతో తెలుగు ఇండస్ట్రీకి తీరనిలోటు ఏర్పడింది. జనవరి 23న ఈయన వర్ధంతి. 2015 జనవరి 23న 64 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఎమ్మెస్ నారాయణ మరణించారు. తెలుగులో ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం మధ్య చెరగని స్నేహం ఉంది. ఎన్నో చిత్రాల్లో వీరిద్దరూ కలసి నటించారు. వీళ్లిద్దరి మధ్య స్నేహానికి ఒక ఉదాహరణ ఉంది. ఎమ్మెస్ నారాయణ చివరి దశలో జరిగిన సంఘటనని బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అనారోగ్యం కారణంగా ఎమ్మెస్ నారాయణ ఆసుపత్రిలో చేరినప్పుడు ఆయన పరిస్థితి విషమించింది.

మరో గంటలో మరణిస్తారు అనగా ఎమ్మెస్ నారాయణ తన కుమార్తెని పిలిచి పేపర్ అడిగారట. ఆ పేపర్ పై బ్రహ్మానందం అన్నయ్యని చూడాలని ఉంది అని రాశారట. దీనితో ఎమ్మెస్ నారాయణ కుమార్తె బ్రహ్మానందం కి ఫోన్ చేశారు. ఆ టైంలో తాను ఆరడగుల బులెట్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెస్ నారాయణ కూతురు ఫోన్ చేసి విషయం చెప్పడంతో బ్రహ్మి డైరెక్టర్ కి చెప్పి ఆసుపత్రికి వెళ్లారు. బ్రహ్మానందం రాగానే ఎమ్మెస్ నారాయణ ఆయన చేయి పెట్టుకున్నారట.

ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కొంత అర్థం అవుతోంది కొంత అర్థం కావడం లేదు. నానా చేతిని గట్టిగా పట్టుకుని అన్నయ్య అంటున్నాడు. ఎమ్మెస్ భాదని చూస్తూ నేను భరించలేకపోయా.. పక్కకు వచ్చేశా. నేను పక్కకి వచ్చిన 15 నిమిషాల్లో ప్రాణం పోయింది అంటూ బ్రహ్మి భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెస్ నారాయణ కమెడియన్ మాత్రమే కాదు.. వాడొక ప్రత్యేకమైన వ్యక్తి. చాలా సింపుల్ గా జోకులు వేస్తుంటాడు.

నార్మల్ గా మాట్లాడినట్లే ఉంటుంది అందులో పంచ్ ఉంటుంది. నాకు ఇష్టమైన కమెడియన్ అతడే అని బ్రహ్మి అన్నారు. ఎల్బీ శ్రీరామ్, కృష్ణ భగవాన్ లాంటి వారిపై ఎమ్మెస్ నారాయణ వేసే పంచ్ లకు నేను కడుపుబ్బా నవ్వే వాడిని. ఒకసారి షూటింగ్ లో వర్షం పడుతోంది. అంతా వర్షం ఎప్పుడు ఆగుతుందా అని ఎదురుచూస్తున్నాం. వర్షం ఆగిపోతుంది అంటారా గురువుగారు అని కృష్ణ భగవాన్ ఎమ్మెస్ ని అడిగారు. ఆగకుండా పడే వర్షాన్ని నా జన్మలో ఇంత వరకు చూడలేదు అని ఎమ్మెస్ సెటైర్ వేశాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker