Health

ముఖానికి ముల్తానీ మట్టి అప్లై చేస్తున్నారా..? ఈ విషయాలు తెలిస్తే..?

ముల్తానీ మ‌ట్టిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మ‌నం మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. ముల్తానీ మ‌ట్టితో ఫేస్ ప్యాక్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. అయితే ముల్తానీ మట్టి మన చర్మానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అందుకే దీన్ని చాలా ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. ముల్తానీ మట్టి ఒక రకమైన సహజ నేల. ఇది తెలుపు లేదా లేత గోధుమ రంగులో ఉంటుంది.

ఇందులో ఉండే వివిధ రకాల మినరల్స్, న్యూట్రీషియన్స్ చర్మానికి పోషణను అందిస్తాయి. ముల్తానీ మిట్టి జిడ్డుగల చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి నూనెను తొలగించే శక్తి ఉంది. ముల్తానీ మట్టి చర్మం రంధ్రాలలో ఉండే అదనపు నూనెను తొలగిస్తుంది. స్కిన్ టోన్ మెరిసేలా ..ముల్తానీ మట్టి ముఖం చర్మంపై ఉండే రంధ్రాలను మూసేసి బిగుతుగా మారుస్తుంది. దీని వల్ల చర్మం ఆకృతి మెరుగ్గా ఉంటుంది. ఈ బంకమట్టి చర్మాన్ని టోన్ చేయడానికి, కాంతివంతంగా చేయడానికి కూడా సహాయపడుతుంది.

ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా కూడా చేస్తుంది. ముల్తానీ మట్టి చర్మంపై ఉండే రంధ్రాలను ఆయిల్ ఫ్రీ చేస్తుంది. దీంతో మొటిమల సమస్యను తొలగిపోతుంది. ముల్తానీ మట్టిని ఉపయోగించడానికి మీరు దీనిని రోజ్ వాటర్ వంటి ఇతర వస్తువులతో మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ ను వేసుకోవచ్చు. చర్మ రకానికి ముల్తానీ మట్టిని ఎలా ఉపయోగించాలంటే..? ఎన్నో గుణాలు సమృద్ధిగా ఉండే ముల్తానీ మట్టిని ముఖానికి సంబంధించిన చాలా సమస్యలకు ఉపయోగించొచ్చు.

జిడ్డుగల చర్మం నుంచి మొటిమల వరకు ఏ రకమైన సమస్య ఉన్నా మీరు ముల్తానీ మట్టిని ఉపయోగించొచ్చు. మొటిమలకు ముల్తానీ మట్టి.. ముల్తానీ మట్టి మొటిమలను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ముల్తానీ మట్టిని గ్రైండ్ గంధం, రోజ్ వాటర్, వేప ఆకుల పొడితో కలిపి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లైచేసి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. జిడ్డుగల చర్మానికి.. మీ చర్మం జిడ్డుగా ఉంటే ముల్తానీ మట్టిని రోజ్ వాటర్ తో మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి.

పేస్ట్ ను తయారు చేసిన తర్వాత ముఖానికి అప్లై చేసి పెదాలు, కళ్ల చుట్టూ ఉన్న ప్రాంతాలకు తాకకుండా అప్లై చేసుకోవాలి. సాధారణ చర్మానికి.. మీ చర్మం నార్మల్ గా ఉంటే అంటే మరీ పొడిబారిన లేదా జిడ్డుగల చర్మం లేకపోతే ముల్తానీ మట్టిని తేనె, పెరుగులో మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 20 నుంచి 30 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker