పవిత్ర ఉన్నాగానీ నేను సంతోషంగా లేను, నరేశ్ షాకింగ్ కంమేట్స్.

ఎప్పుడో ‘ఆలయం’ సినిమా సమయంలో మొదటిసారి కలుసుకున్నాం. అప్పుడు పవిత్ర నాతో మాట్లాడలేదు. దాంతో ఈ అమ్మాయికి పొగరేమో అని నేను ముందు లైట్ తీసుకున్నా. మళ్లీ ఆ తర్వాత 10 ఏళ్లకు ‘హ్యాపీవెడ్డింగ్’ షూటింగ్ సమయంలో కలుసుకున్నాం. ఆ టైంలో నాతో గలగలా మాట్లాడుతూనే ఉంది. షూటింగ్ జరుగుతుండగానే నా గురించి చాలా విషయాలు తెలుసుకుంది. అప్పుడు నేను షాక్ అయ్యా. ఆ టైంలోనే ఈ అమ్మాయి బాగుంది, అందంగా ఉందనిపించి ఓ పాజిటివ్ ఎనర్జీ కలిగింది.
ఇక షూటింగ్ అయిపోయాక మళ్ళీ నాతో మాట్లాడలేదు. అని నరేశ్ చెప్పాడు. అయితే అవును పైన చెప్పిందంతా కూడా నరేశ్-పవిత్రా లోకేశ్ గురించే. వినాయక చవితి సందర్భంగా ఓ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన షోలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రాంలో నరేశ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీనియర్ నరేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు.
తొలుత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మోస్ట్ బిజీయెస్ట్‌గా మారిపోయాడు. కెరీర్ పరంగా పీక్స్‌లో ఉన్న ఇతడు.. వైవాహిక జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నరేశ్, అతడి భార్య రమ్య రఘుపతి మధ్య చాన్నాళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే కొన్నాళ్లుగా ఇతడు, నటి పవిత్రా లోకేశ్ తో కలిసి ఉంటున్నారని వార్తలొచ్చాయి. ఇది నిజమనేలా బయటకూడా జంటగా కనిపించడం,
‘మళ్లీ పెళ్లి’ అని తమ జీవితాన్నే సినిమాగా తీయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. అయితే వినాయక చవితి సందర్భంగా నరేశ్-పవిత్రా లోకేశ్‌ని ఓ ఈవెంట్‌కి గెస్టులుగా పిలిచారు. నరేశ్.. ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. స్టేజీపై సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ నరేశ్ ఎమోషనల్ అయ్యాడు. ’50 ఏళ్లు అయిపోయింది.
పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో రకరకాల ఒడిదొడుకులు. గతంలో చేసిన వాటి గురించి నేను బాధపడుతున్నాను’ అని అన్నాడు. అయితే అది తన పెళ్లిళ్ల గురించి, లేదా మరేదైనా విషయమా అనేది తెలియాల్సి ఉంది.