News

రెండో భర్తతో ప్రెగ్నెన్సీ అయిన స్టార్ హీరోయిన్, మీ ఆశీర్వాదాలు కావాలంటూ..!

భారతీయ నటి నీనా గుప్తా, వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ల కుమార్తె మసాబా గుప్తా 1989లో జన్మించింది. మసాబా గుప్తా తల్లిదండ్రులు వివాహం చేసుకోలేదు. ఆమె తల్లి వద్ద ఉండేది. ఆమె కుటుంబం న్యూఢిల్లీ నుండి ముంబైకి మారింది. ఆమెకు 20 ఏళ్లు వచ్చాక ఆమె తన తండ్రితో మళ్లీ కనెక్ట్ అయ్యింది. అయితే ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురిగా మసాబా గుప్తా అందరికీ సుపరిచితమే.

ప్యాషన్‌ డిజైనర్‌ కెరీర్ ప్రారంభించిన ఆమె నటిగాను గుర్తింపు తెచ్చుకుంది. 2023లో రెండోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టిన మసాబా.. తాజాగా అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మీ అందరీ ఆశీర్వాదాలు కావాలంటూ ఇన్‌స్టాలో షేర్ చేసింది.

ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ తారలు కరీనా కపూర్, షెహనాజ్ గిల్, కుషా కపిల, తాహిరా కశ్యప్, సారా టెండూల్కర్, బిపాసా బసు, పరిణీతి చోప్రా, అనన్య పాండే, కృతి సనన్ అభినందనలు తెలిపారు. కాగా.. మాసాబా గుప్తా, సత్యదీప్‌లు కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2023లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకలో వారి సన్నిహితులు, ఆమె తండ్రి మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.

కాగా.. గతంలో టాలీవుడ్ నిర్మాత మధు మంతెనను వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. సత్యదీప్ సైతం గతంలోనే అదితి రావు హైదరీని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ఇటీవలే ఆదితిరావు హైదరీ- సిద్ధార్థ్‌ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker