Health

ఈ రహస్యలు తెలిస్తే ఈ ఆకులను జీవితంలో పడేయారు, లాభాలు ఏంటో తెలుసుకోండి.

నేరేడు ఆకు చూర్ణంతో పండ్లు తోమితే కదిలే దంతాలు గట్టిపడతాయి. అలాగే నేరేడు చెక్క కషాయాన్ని పుక్కిలిపడితే నోటిలోని పుండ్లు చాలా త్వరగా మానిపోతాయి. అయితే నేరేడు పండ్లతో కలిగే లాభాలు ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్‌ బ్లాక్‌బెర్రీగా పిలుచుకునే ఈ పండ్లు ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్‌, మాంగనీస్‌, పొటాషియం, పాస్పరస్‌, క్యాల్షియంకు పెట్టింది పేరు. ఇందులోని ఎన్నో పోషక విలువలు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఎన్నో అధ్యయనాల్లో కూడా నేరేడు పండు వల్ల కలిగే లాభాలను వివరించారు. అయితే కేవలం నేరేడు పండ్లు మాత్రమే కాకుండా, నేరేడు ఆకులతో కూడా ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. నేరేడు ఆకుల్లోని ఆకులు యాంటీఆక్సిడెంట్స్‌, యాంటీ-వైరస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకుల్లోని పోషక విలువలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, మలబద్ధకం, అలెర్జీలను తొలగించడంలో ఉపయోగపడుతాయి.

US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ యొక్క అధ్యయనాల ప్రకారం నేరేడు ఆకుల ద్వారా.. హార్మోన్ల రొమ్ము క్యాన్సర్ నివారణపై , బెర్రీలలో ఉండే ఆంథోసైనిన్‌లు శరీరంలో యాంటీకాన్సర్ కణాలను సృష్టిస్తాయి. సాధారణంగా నేరేడు పండ్లు జున్‌, జూలై మధ్య పండుతాయి. అయితే ఆకులు మాత్రం ఏడాది పొడవునా తినొచ్చు. ఆకులను నీటిలో మరిగించి తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. ఊబకాయానికి చెక్‌ పెట్టడంలో నేరేడు ఆకులు ఎంతగానో ఉపయోగపడుతాయి. నేరేడు ఆకులను మెంతి గింజలతో ఉడకబెట్టి తసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు.

ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో కూడా ఇది సహాయపడుతుంది. నేరేడు ఆకులను ఎండబెట్టి పొడి చేసి అందులో ఉసిరికాయ పొడిని కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గడంతోపాటు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోపడుతుంది. అధిక మల విసర్జన సమస్యతో బాధపడే వారికి నేరేడు ఆకులు ఉపయోగపడుతాయి.

నేరేడు ఆకులను కషాయంగా చేసుకొని తీసుకుంటే ఫలితం ఉంటుంది. కాలేయం పనితీరు మెరుగుపరచడంలో నేరేడు ఆకలు ఉపయోగపడతాయి. నేరేడు ఆకుల కషాయంను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. తీవ్ర జ్వరంతో బాధపడేవారికి కూడా నేరేడు ఆకులు ఉపయోగపడతాయి. నేరేడు ఆకుల రసంలో ధనియాలు వేసి తీసుకున్నట్లయితే జ్వరం తగ్గిపోతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker