Health

రాత్రివేళ గుండె వేగంగా కొట్టుకుంటుందా..? మీరు ఇలా లేకపోతే చాలా ప్రమాదం.

సాధారణ వ్యక్తి గుండె కొట్టుకునే రేటు నిమిషానికి 60 నుంచి 100 మధ్యలో ఉండాలి. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటంటే చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. కానీ కొందరికీ మాత్రం నిమిషానికి 100కు పైగా గుండె కొట్టుకుంటోంది. ఇలా ఎల్లప్పుడూ కొట్టుకోవడం మంచిది కాదు. దీన్ని ‘టాకీ కార్డియా’ అంటారు.దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఎప్పటికైనా గుండెకు ముప్పుగా మారుతుంది. అయితే మందికి రాత్రి నిద్రపోయే ముందు గుండె కొట్టుకునే సమస్య ఎక్కువగా ఉంటుంది.

అయితే కొందరు దీనిని సాధారణ సమస్యగా విస్మరిస్తారు. కానీ గుండె అధికంగా కొట్టుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. హృదయ స్పందన రేటు పెరిగినప్పుడు అకస్మాత్తుగా చెమటలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. గుండెలో సమస్య ఉందనడానికి ఇది ప్రత్యక్ష సూచన. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఇది గుండెపోటుకు దారితీస్తుంది. గుండెలో ఎలక్ట్రికల్ ఇంపల్స్ పెరగడం వల్ల గుండె కొట్టుకోవడం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఇది ఆకస్మిక భయము వల్ల కూడా జరగవచ్చు. కానీ ఎటువంటి కారణం లేకుండా రాత్రి నిద్రిస్తున్నప్పుడు గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. అప్పుడు ఈ సమస్య గుండెపోటుకు దారితీస్తుంది. చాలా సందర్భాలలో గుండె ధమనులలో రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. అందుకే ప్రజలు ఈ సమస్యను తేలికగా తీసుకోవద్దు. ఈ సమస్య కొన్ని రోజుల పాటు ఇలాగే కొనసాగితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం.

ఈ వ్యక్తులకు మరింత ఇబ్బందులు మధుమేహం, హైబీపీ, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారు గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అధిక బీపీ, మధుమేహం కారణంగా ఇప్పటికే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితిలో విద్యుత్ ప్రేరణలు పెరుగుతున్నట్లయితే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి.

చికిత్స ఏమిటి..? చాలా మందిలో ఈ సమస్య కొద్ది రోజుల్లోనే నయమవుతుంది. కానీ అది జరగకపోతే దానికి మందులు అవసరం. వైద్యుడిని సంప్రదించిన తర్వాత చికిత్స చేయాలి. అధిక ప్రమాదం ఉన్న రోగులలో శస్త్రచికిత్స ద్వారా నయంచేస్తారు. వేగవంతమైన హృదయ స్పందన సమస్య ఒక వారం కంటే ఎక్కువ కాలం కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్య వద్దు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker