Health

రాత్రిపూట మీ జుట్టు రాలుతుందా..? మీరు వెంటనే ఎలాంటి జాగర్తలు పాటించాలో తెలుసుకోండి.

మీ జుట్టును దృఢంగా, దీర్ఘకాలం పాటు ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. హెల్తీ ఫుడ్స్ హెయిర్ ఫోలికల్స్ ను లోపల నుండి పోషణనిచ్చి వాటిని మరింత స్థితిస్థాపకంగా మారుస్తాయి. అయితే అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు తమ సొంతం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికోసం చాలా మంది వేలకు వేలు ఖర్చు చేసి షాంపూలు, నూనెలు, కండిషనర్లు వాడుతూ ఉంటారు. అయినా అంత ఖర్చు చేసినా కూడా జుట్టు నిర్జీవంగా మారడం, ఊడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారా? అయితే… ఈ కింది అలవాట్లను అలవరుచుకోండి.

మీరు చదివింది నిజమే. మీరు ఉపయోగించే దిండు కూడా మీ జుట్టురాలడానికి కారణం కావచ్చు. అవును.. మీరు కాటన్ పిల్లో కవర్ వాడటం వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. దానికి బదులు సాటిన్ క్లాత్ తో ఉండే పిల్లో కవర్ వాడటం అలవాటు చేసుకోండి. దీని వల్ల జుట్టు రఫ్ గా మారడం, ఊడిపోవడం లాంటి సమస్య ఉండదు. .ఉధయాన్నే లేవగానే జుట్టు దువ్వుకునే అలవాటు అందరికీ ఉంటుంది. కానీ.. రాత్రి పడుకునే ముందు కూడా హెయిర్ దువ్వుకోవాలి. పడుకునే ముందు ఈ సోకులు అవసరమా అని మీకు అనిపించొచ్చు.

కానీ.. జుట్టు హెల్దీగా ఉండాలి అంటే తప్పదు మరి. జుట్టు రఫ్ గా మారకుండా ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా తలలో తయారయ్యే సహజ నూనెలు కుదుళ్ల నుంచి చివర్ల వరకు చేరడంలో సహాయపడుతుంది. మనం ఎలాంటి హెయిర్ బ్యాండ్ వాడుతున్నాం అనేది కూడా జుట్టు రాలడం పై ఆధారపడి ఉంటుంది. జుట్టును గట్టిగా పట్టి ఉంచే రబ్బరు బ్యాండ్లు కాకుండా.. స్క్రంచీస్ వాడటం అలవాటు చేసుకోవాలి. వాటి క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది. కాబట్టి.. జుట్టు ఊడుతుందనే భయం ఉండదు. హెయిర్ డ్యామేజ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది.

నూనె రాయడం.. అందరూ తలకు నూనె రాయడం అంటే కేవలం తలకు మాత్రమే రాస్తారు.. కింద చివర్లను పెద్దగా పట్టించుకోరు. తలలో కుదుళ్లకు మాత్రమే కాదు… కింది చివర్లకు కూడా నూనె మంచిగా రాయాలి. అప్పుడే హెయిర్ డ్యామేజ్, బ్రేకేజ్ లాంటి సమస్యలు ఉండవు తడి తలతో పడుకోకూడదు. చాలా మంది రాత్రిపూట తల స్నానం చేసి.. ఆ తల సరిగా తుడవకుండానే పడుకుంటూ ఉంటారు. కానీ.. ఇలా చేయడం వల్ల జుట్టు పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి.. ఈ పొరపాటు చేయకూడదు. ఈ తప్పులు చేయకుండా ఉంటే… మీ జుట్టురాలే సమస్య నుంచి భయటపడొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker