పాలల్లో ఈ చూర్ణన్ని కలిపి తాగితే నరాల బలహీనత సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది.

శరీర భాగాలకు ఏదైనా గాయం అయినప్పుడో లేదా తీవ్రమైన ఒత్తిడి వల్ల నరాలు బలహీనపడిపోతాయి. దాని వల్ల శరీర పనితీరు మందగిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి, ఔషధాల అధిక వినియోగం, నిశ్చల జీవనశైలి, మధుమేహం వంటి వాటి వల్ల నరాలు బలహీనపడిపోతాయి. ఇవే కాదు ఆల్కాహాల్, మాదక ద్రవ్యాల వినియోగం, ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత, బ్రెయిన్ ట్యూమర్స్, స్ట్రోక్స్ వంటివి నాడీ వ్యవస్థకి హాని కలిగిస్తాయి. అయితే ఆధునిక జీవనశైలి అనుసరించడం కారణంగా చిన్నా పెద్ద తేడా లేకుండా అందరిలోనూ నరాల బలహీనత సమస్యలు వస్తున్నాయి.
ఇలాంటి సమస్యల బారిన పడిన చాలామందిలో దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి నరాల బలహీనత సమస్యలతో బాధపడుతున్న వారు శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రానంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నరాల బలహీనత సమస్యలతో బాధపడే వారిలో నరాల స్పర్శ కోల్పోతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక తలనొప్పి తో పాటు కాళ్లు చేతులు ఎత్తలేకపోవడం..
త్వరగా అలిసిపోవడం, తిమ్మిర్లు రావడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి ప్రధాన అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఎంత సులభంగా ఉపశమనం పొందితే.. అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ఈ సమస్యల కారణంగా వివిధ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పట్టిపీడించే నరాల బలహీనత సమస్యలతో బాధపడుతున్న వారు మార్కెట్లో లభించే చాలా రకాల ఔషధాలను వినియోగిస్తున్నారు.
వీటిని వినియోగించడం వల్ల ఎలాంటి లాభాలు ఉండవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు మూలికలను ప్రతిరోజు వినియోగించాల్సి ఉంటుంది. నరాల బలహీనత సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు అశ్వగంధ చూర్ణాన్ని పాలలో కలుపుకొని తాగాల్సి ఉంటుంది.
దీంతోపాటు అతి మధుర చెట్టు వేరు పొడిని కలుపుకొని తాగడం వల్ల కూడా గొప్ప ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. అశ్వగంధ చూర్ణం 1 స్పూన్, అతిమధురం పొడి ఒక టీ స్పూన్ తీసుకొని.. గ్లాసేడు పాలలో కలుపుకొని ప్రతిరోజు తాగడం వల్ల కూడా నరాల బలహీనత తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.