News

పెళ్లి తర్వాత ఏడాదిలోనే ఆ విషయం తెలిసింది. అందుకే విడాకులు తీసుకున్నాం : నిహారిక

నిహారిక..ఎదుటివారిని ఈజీగా న‌మ్మ‌కూడ‌ద‌ని పెళ్లి త‌ర్వాతే అర్థం చేసుకున్నాన‌ని చెప్పింది,, అదొక అనుభ‌వ‌పాఠంగా భావించి ముందుకు సాగ‌డం అల‌వాటు చేసుకున్నాన‌ని చెప్పింది. ఇప్ప‌టికీ అవ‌న్నీ గుర్తొస్తే క‌న్నీళ్లు వ‌స్తుంటాయ‌ని తెలిపింది. అయితే ఆమె సినీ ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేక పోయింది. ఒక మనసు సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లో ఓ సినిమా చేసింది.

ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్ గా సినిమాలు నిర్మిస్తోంది నిహారిక. ఇదిలా ఉంటే ఈ అమ్మడు చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. వీరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. అయితే ఏడాది కూడా కాకుండానే ఈ జంట విడిపోయింది. వీరి విడిపోతున్నారని తెలిసి మెగా ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. విడిపోయిన తర్వాత నిహారిక ఎక్కడా విడాకుల గురించి మాట్లాడలేదు. అటు చైతూ కూడా విడిపోవడం పై మాట్లాడలేదు.

ఇద్దరూ తమ లైఫ్ లో బిజీగా మారిపోయారు. విడిపోయిన తర్వాత నిహారిక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యింది. రోజూ రకరకాల ఫోటో షూట్స్ తో అదరగొట్టింది. తాజాగా విడాకుల పై తొలి సారి స్పందించింది నిహారిక. ఎదుటివారిని ఈజీగా న‌మ్మ‌కూడ‌ద‌ని పెళ్లి త‌ర్వాతే అర్థం చేసుకున్నాన‌ని అంటుంది నిహారిక. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఎవ్వరినీ అంత ఈజీగా నమ్మకూడదు. విడాకులతోనే జీవితం ముగిసిపోయిన‌ట్లుగా నేను అనుకోను.

పెళ్లి తర్వాత జరిగినవి ఓ అనుభవపాఠాలుగా మార్చుకొని ముందుకు సాగుతున్నా అని తెలిపింది నిహారిక. ఎవ్వరి జీవితంలోనైనా పెళ్లి ఎంతో ముఖ్య‌మ‌నై ఘ‌ట్ట‌మ‌ని.. కలకాలం కలిసే ఉంటాం అనే అందరూ పెళ్లి చేసుకుంటారు. కానీ ఏడాదిలోనే విడాకులు తీసుకుంటాం అని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు అని తెలిపింది నిహారిక. నేను అలాగే ఆలోచించా. కానీ నేను ఊహించిన‌ట్లు జ‌ర‌గ‌లేదు. నా ఫ్యామిలీ ఏమనుకుంటారు అన్నదే నాకు ముఖ్యం అని తెలిపింది నిహారిక.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker