Health

ఎంత ప్రయత్నించినా సంతానం కలగడం లేదా..? మీరు చేస్తున్న తప్పు ఇదే కావొచ్చు.

మారుతున్న జీవన విధానం కారణంగా వయసు, ఆరోగ్యం, ఆహార్యంతో సంబంధం లేకుండా ఎంతో మంది దంపతులు సంతానలేమితో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆస్పత్రులు తిరిగినా చాలా మంది దంపతులు కోరుకున్నది దక్కించులేకపోతున్నారు. అలా పిల్లల కోసం పరితపించే వారి కలలను సాకారం చేసేందుకు ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చెందిన సాంకేతికత అందుబాటులో ఉంది. అయితే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం కలిసి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.

అనుకున్నంత మాత్రాన అన్నీ అయిపోవు. ఒక్కోసారి అనుకున్నవి జరగకపోవచ్చు. కొన్ని కొన్ని సార్లు నిరాశ కూడా కలుగుతూ ఉంటుంది. కొంత మంది పెళ్లి తర్వాత పిల్లల కోసం ఎంతో ఆరాట పడుతూ ఉంటారు. కానీ కలగానే మిగిలిపోతూ ఉంటుంది. సంతానం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. సంతానలేమి సమస్య ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. చాలామంది దంపతులు ఈ బాధలు పడుతున్నారు.

ఒకవేళ సంతానం కలగకపోతే వైద్య పరీక్షలు చేయించుకుని సంతానం ఎందుకు కలగడం లేదు అనేది తెలుసుకొని, సంతానం కలగడం కోసం వైద్యుని సలహా తీసుకుంటే కచ్చితంగా పిల్లలు పుడతారు. ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వకపోతే ఐయూఐ చేస్తారు. డాక్టర్లు మొదట పిల్లలు లేని వాళ్లకి ఐవీఎఫ్ పద్ధతిని చేయడానికి ముందు ఐయూఐ పద్ధతిని అనుసరిస్తారు. ఇది కనుక అవ్వకపోతే అప్పుడు ఐవీఎఫ్ ని ఫాలో అవుతారు.

ఐయూఐ పద్ధతిలో స్పెర్మ్ ని కలెక్ట్ చేసి డైరెక్ట్ గా యుటెరస్ లోకి పంపుతారు. ఇది చాలా సహజమైన ప్రొసీజర్ ఏ. స్పెర్మ్ ని పంపగానే అది ఫాలోపియన్ ట్యూబ్స్ దగ్గరకి వెళుతుంది. కొన్ని రకాల మెడికేషన్ ద్వారా ఎగ్ ని ఫార్మ్ చేసాయడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాల‌ని కల్పిస్తారు. ఎక్కువ మోతాదులో గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే చాలా ప్రమాదం.

మాములుగా తీసుకుంటే ఒకటి లేదా రెండు నెలల్లో సంతానోత్పత్తి సాధారణ స్థితికి వస్తుంది. అదే ఒకవేళ అధికంగా ఈ మాత్రలు తీసుకుంటే సంతానోత్పత్తి సాధారణ స్థితికి రావడానికి మూడు నుండి 6 నెలలు సమయం పడుతుంది. ఐవీఎఫ్ పద్దతి పూర్తి కావడానికి, పూర్తి చేసుకోవడానికి కొన్ని నెలల‌ సమయం పడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker