News

పెళ్లి కాకుండానే తల్లైన స్టార్ నటి, అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే..?

సీరియల్స్ నటిగా ప్రస్థానం మొదలుపెట్టిన సాక్షి తన్వర్.. తరువాత కొన్ని సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ”కహాని ఘర్ ఘర్ కి” సీరియల్‌తో సాక్షి తన్వర్ విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తరువాత పలు రియాల్టీ షోల్లో యాంకర్‌గా కూడా కనిపించారామె. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో అతనికి జోడికి నటించి మెప్పించింది. గ్రామీణ మహిళగా సాక్షి తన్వర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇక సాక్షి తన్వర్ వ్యక్తిగత జీవితానికి వస్తే..ఆమె 1973లో రాజస్థాన్‌లో రాజ్ పుత్ ఫ్యామిలీ‌లో సాక్షి తన్వర్ జన్మించింది. ఆమె తండ్రి ఓ రిటైర్డ్ సీబీఐ ఆఫీసర్. నటన మీద ఆసక్తితో సినిమా రంగంవైపు ఆమె అడుగులు పడ్డాయి. సాక్షి తన్వర్ ప్రస్తుత వయసు 50 ఏళ్ళు. అయితే కహాని ఘర్ ఘర్ కి సీరియల్ తో సాక్షి తన్వర్ విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది.

2000లో ప్రసారమైన కహానీ ఘర్ ఘర్ కి సాక్షి తన్వర్ ఇండియా వైడ్ పాప్యులర్ చేసింది. ఈ సీరియల్ పలు భాషల్లో డబ్ అయ్యింది. ఇరవైకి సీరియల్స్ లో సాక్షి తన్వర్ నటించింది. సాక్షి తన్వర్ లోని సహజ నటనకు మెచ్చి దంగల్ డైరెక్టర్ నితీష్ తివారి అమర్ ఖాన్ కి జంటగా ఛాన్స్ ఇచ్చాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో సాక్షి అమిర్ ఖాన్ వైఫ్ రోల్ చేశారు.

స్పోర్ట్స్ డ్రామా దంగల వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సాక్షి తన్వర్ పాత్ర మెప్పించింది. కాగా సాక్షి ప్రస్తుత వయసు 50 ఏళ్ళు. సాక్షి తన్వర్ పెళ్లి చేసుకోలేదు. అందుకు కారణం ఏమిటో తెలియదు. అయితే ఓ ఐదేళ్ల క్రితం పాపను దత్తత తీసుకుంది. అలా పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది.

మొహల్లా అస్సి, డైల్ 100, సామ్రాట్ పృథ్విరాజ్ చిత్రాల్లో ఆమె నటించారు . సామ్రాట్ పృథ్విరాజ్ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించారు. సీరియల్స్ తో పాటు వెబ్ సిరీస్లలో ఆమె నటిస్తున్నారు. ఇక ఈమె ఒక సీరియల్ ఎపిసోడ్ కి రూ. 1.5 లక్షలు తీసుకుంటారట.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker