Health

నిరంతరం దగ్గు వస్తుందా..? మీకు ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

సిగరెట్‌ పొగ, దుమ్ము, పుప్పొడి, రసాయనాలు ఇలా చాలా పదార్ధాలు శ్వాస ద్వారా లోపలికి చేరినప్పుడు, వీటిని బయటకు పంపించేసేందుకు మన ఊపిరితిత్తులు దగ్గు రూపంలో వేగంగా స్పందిస్తాయి. ఇక ముక్కుల్లో ఇన్‌ఫెక్షన్‌, అలర్జీ, సైనుసైటిస్‌, గొంతు నొప్పి, కొన్ని రకాల గుండె జబ్బులు, వీటన్నింటిలో కూడా దగ్గు రావచ్చు. అయితే వ్యాధి ప్రారంభ సంకేతాలను గుర్తించడంలో నిర్లక్ష్యం వల్ల లంగ్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఆలస్య రోగ నిర్ధారణ, సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల క్యాన్సర్ చివరి స్టేజ్ వరకు వస్తుందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

పొగాకు నియంత్రణ చర్యలు, పర్యావరణ ప్రమాద కారకాలకు గురి కావడం తగ్గించడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ సంభావ్యతని తగ్గించుకుని ప్రాణాలు కాపాడుకోవచ్చు. ముందస్తుగా గుర్తించి, సకాలంలో చికిత్స చేయడం వల్ల వ్యాధి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. నిరంతర దగ్గు వస్తుంటే దాన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణ ప్రారంభ లక్షణంగా గుర్తించాలి. ఇది పొడిగా లేదంటే శ్లేష్మం కూడా ఉత్పత్తి చేయవచ్చు. శ్వాస ఆడకపోవడం లేదంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురి చేస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఛాతీ నొప్పికి కారణం కావచ్చు.

లోతైన శ్వాస తీసుకుంటున్నప్పుడు లేదంటే దగ్గుతున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు నొప్పిగా అనిపిస్తుంది. శారీరక శ్రమలో ఎటువంటి మార్పులు లేకుండా బరువు తగ్గిపోతారు. నిరంతరం అలసట, గొంతు బొంగురు పోవడం, దగ్గేటప్పుడు రక్తం రావడం కూడ మరికొన్ని లక్షణాలు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కి సిగరెట్ తాగడం ప్రధాన కారణం. పొగాకు పొగలో అనేక క్యాన్సర్ కారకాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను కప్పే కణాలను దెబ్బతీస్తాయి. ధూమాపనం చేయని వారితో పోలిస్తే ధూమపానం చేసే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. పొగ తాగే వారి పక్కన ఉన్న వారికి కూడా దీని ప్రమాదం కొంత మేరకు ఉంటుంది.

రేడియోధార్మిక వాయువుకి ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. వాయు కాలుష్యం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దోహదపడుతుంది. ఇవి కాకుండా జన్యుపరమైన కారకాలు, రేడియేషన్ కు గురికావడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ కుటుంబ చరిత్రను కలిగి ఉండటం కూడా ఈ క్యాన్సర్ అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. సిగరెట్లు అధికంగా తాగే వాళ్ళు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. ధూమపానం చేసే వారితో పాటు పొగ వాతావరణంలో ఎక్కువ సమయం గడిపే వాళ్ళు కూడా ప్రమాదం అంచున ఉన్నట్టే.

COPD వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నవారు, ఛాతీ ప్రాంతంలో రేడియేషన్ చికిత్స పొందిన వాళ్ళు ఈ క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. చికిత్స సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇమ్యునోథెరపీ, యాంటీ యాంజియోజెనిక్ థెరపీ వంటి చికిత్సలు వ్యాధి ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇంటర్నెట్ లో కనిపించే ఫ్యాన్సీ డైట్ ఫాలో అవడం నివారించాలి. న్యూట్రోపెనిక్ ఆహారాలు అసలు తీసుకోవద్దు. పండ్ల రసాలకు బదులుగా పండ్లు తినడం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker