Health

ఈ కాయలు ఎక్కడ కనిపించినా తినేయండి, క్యాన్సర్‌తో పాటు 100 రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.

ఈ అద్భుత ఫలానికి 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేసే శక్తి ఉందని, దానిలో 150 కి పైగా పోషకాలు ఉన్నట్లు పెద్దలు చెబుతారు. దీనిని సేవిస్తే, క్యాన్సర్ తో పాటు ప్రాణాంతక వ్యాధులను కూడా నివారిస్తుందట. మీరు మార్కెట్లో సులభంగా తొగరు పండ్లను పొందవచ్చు. కరోనా కాలంలో చాలామంది రోగ నిరోధక శక్తి కోసం ప్రయత్నిస్తున్నారు. రకరకాల పండ్లను తింటూ ఉంటున్నారు. ఈ తొగరు పండ్లు తినడం వల్ల కూడా రోగనిధరక శక్తి పెరుగుతుంది.

అయితే ప్రకృతిలో లభించే అనేక రకాలైన పండ్లు, కాయలు ఎన్నో రోగాలను నయం చేస్తాయి. అందులో నోని పండు కూడా ఒకటి. దీనినే తొగరు పండు అని కూడా అంటారు. బంగాళాదుంప ఆకారంలో పసుపు, లేత ఆకుపచ్చ రంగులో కనిపించే ఈ పండు చూస్తే గుర్తు పడతారు.. కానీ, ఈ పండు గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. కానీ, ఈ పండు ఆరోగ్యానికి ఔషధ గని వంటిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఈ పండులో విటమిన్ సి, బి3, ఎ, ఐరన్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. దీని ఆకులు, బెరడు, వేర్లు కూడా పలు రకాల మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ నోని పండ్లతో తయారు చేసిన జ్యూస్ రోజు తాగడం ద్వారా మన రోగ నిరోధక శక్తి బలంగా మారుతుంది. నోని పండు రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. దీని ఆకులు కూడా మధుమేహానికి మేలు చేస్తాయి.

ఈ పండ్లు లేదా జ్యూస్ తాగితే షుగర్ వ్యాధిని కంట్రోల్ అవుతుంది. ఈ పండులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వినియోగం ఎముకల రాపిడిని తగ్గించడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్ సి ఉన్నాయి. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఈ పండు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నోని పండ్ల ఆకులలో ఉండే ఔషధ గుణాలు వాపు, ఎరుపు, దురద వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker