Health

ముక్కుపై పింపుల్స్‌ వస్తున్నాయా..? మీ గుండె ఆరోగ్యం ఒకసారి చెక్ చేసుకోండి.

ముఖం పై మొటిమలు వస్తే చిరాకు పడని వారెవ్వరూ ఉండరు. వాటి వాళ్ళ ముఖం అందం పోతోందని బాధపడే వారు ఎక్కువమంది ఉంటారు. అయితే పేస్ పై ఒక్కో చోట వచ్చే పింపుల్ కు ఒక్కో కారణం ఉంటుంది. ఒకవేళ మీ బుగ్గలపై మొటిమలు వచ్చాయని అనుకోండి.. దాని వలన మీ దంతాలతో సమస్య ఉందని అర్ధం. అయితే, రిఫ్లెక్సాలజీ సాయంతో కొన్ని నిర్దిష్టమైన చోట్ల మసాజ్ చేయడం ద్వారా ఆయా వ్యాధులను దూరం చేయచ్చట. అయితే యంగ్‌ ఏజ్‌లో ఉన్నప్పుడు ముఖంపై మొటిమలు రావడం ఖాయం.

మనం తినే ఆహారాల వల్ల మొటిమలు వస్తాయి అని మనం అనుకుంటాం.. మొటిమలు మొఖంపై వచ్చే ప్లేస్‌ను బట్టి మీ లోపల ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేయొచ్చట.. అంటే ఫేస్‌పై ఒక్కో ప్లేస్‌లో వచ్చే మొటిమలకు ఒక్కో కారణం ఉంటుంది. మనం బుగ్గలపై మొటిమలు వస్తే.. వీటికి ఇంక ఎక్కడా ప్లేస్‌ దొరకలేదేమో.. పోయి పోయి బుగ్గలపైనే వచ్చాయి అనుకుంటాం. కానీ వాటికి కారణం.. మీ దంతాల్లో సమస్య ఉందని. శరీరంలోని కొన్ని నిర్దిష్టమైన‌ ప్రదేశాల్లో కొంత సమయం పాటు సున్నితంగా మసాజ్ చేయడం లేదా వాటిపై ఒత్తిడి కలగజేస్తే ఆయా రుగ్మతలు, వ్యాధులను దూరం చేసుకోవచ్చని రిఫ్లెక్సాలజీ చెబుతోంది.

దీని గురించి మీరు వినే ఉంటారు. అయితే ముఖంపై ఏర్పడే మొటిమలు కూడా ఈ రిఫ్లెక్సాలజీ ఆధారంగానే శరీర అవయవాలు, వ్యవస్థ గురించి, వాటి ఆరోగ్యం గురించి తెలియజేస్తాయి. నుదుటి భాగంలో మొటిమలు వస్తే మీ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని అర్థం. వెంటనే మీరు జంక్‌ఫుడ్, కొవ్వు పదార్థాలను మానేయాలి. చల్లగా ఉండే దోసకాయ, ఐస్ క్రీం వంటి పదార్థాలను తీసుకుంటే ఫలితం ఉంటుంది. కొద్ది రోజులు ఇలా చేసి చూస్తే వచ్చే మార్పుల‌ను మీరు గమనించవచ్చు. కనుబొమ్మల మధ్యలో మొటిమలు, మచ్చలు వస్తే లివర్ పనితీరు బాగా లేదని అర్థమవుతుంది.

ఆల్కహాల్, పాల ఉత్పత్తులు, పిజ్జా, బర్గర్, చిప్స్ వంటివి మానేసి చూస్తే ఫలితం ఉంటుంది. బుగ్గల కింది భాగంలో మొటిమలు ఉంటే నోటిలో ఇన్‌ఫెక్షన్లు, దంత సంబంధ వ్యాధులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. బుగ్గలపై కంటి కిందగా మొటిమలు ఉంటే ఊపిరితిత్తులు బాగా పనిచేయడం లేదని తెలుసుకోవాలి. పొగతాగడం, గాలి కాలుష్యం వంటి వాటి వల్ల ఇలా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యతను గడ్డంపై ఏర్పడే మొటిమలు సూచిస్తాయి. ప్రధానంగా రుతు సంబంధ సమస్యలను ఎదుర్కొనే మహిళల్లో ఈ తరహా మొటిమలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఛాతి, మెడ భాగాల్లోని మొటిమలు శరీరానికి కలిగే ఒత్తిడిని సూచిస్తాయి. యోగా, ధ్యానం వంటివి రోజూ చేస్తే ఫలితం కనిపిస్తుంది. ముక్కుపై ఏర్పడే మొటిమలు గుండె పనితీరు, హైబీపీ వంటి రుగ్మతలను తెలియజేస్తాయి. మసాలాలు, కారం ఎక్కువగా వేసి వండిన ఆహారం, కొవ్వు పదార్థాలను వెంటనే మానేసి వాటికి బదులుగా నట్స్‌ను తీసుకోవాలి. దీంతో మొటిమ‌లు పోతాయి. ఇలా ముఖంపై ఏర్ప‌డే మొటిమ‌ల‌ను బ‌ట్టి మ‌న‌కు ఉన్న అనారోగ్యాల గురించి సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. క‌నుక ఇక‌పై మీరు కూడా ఇలాగే ప‌రిశీలించండి. వ్యాధుల‌ను ముందుగానే తెలుసుకుని జాగ్ర‌త్త ప‌డండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker