శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి పై అసలు విషయం చెప్పిన వైద్యులు.

71 సంవత్సరాల శరత్ బాబుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ప్రత్యేక డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోందని, వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయన త్వరగా కోలుకుంటారని ఏఐజీ ఆస్పత్రి ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత బాగానే ఉందని ఆయనను రూమ్ కి కూడా షిఫ్ట్ చేశారని ఆమె మీడియాకు సమాచారం ఇవ్వడంతో శరత్ బాబు మరణించారు అనే వార్త ప్రచారం కావడానికి బ్రేకులు పడ్డాయి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన చికిత్స పొందుతున్న ఏఐజి హాస్పిటల్ నుంచి ఒక హెల్త్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.
శరత్ బాబు ఆరోగ్యం గురించి ఆయన మరణించారని జరుగుతున్న ప్రచారం గురించి స్పందిస్తూ ఆయన మరణించారనే వార్త పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఆయనకి చికిత్స అందిస్తున్నామని ఏఐజీ హాస్పిటల్ విడుదల చేసిన రిపోర్టులో పేర్కొన్నారు. తమ హాస్పిటల్ లో ఉన్న బెస్ట్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు.

నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఈ రిపోర్ట్ విడుదల కాగా ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు. ఇక శరత్ బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ తేజస్ కూడా శరత్ బాబు ఆరోగ్యం గురించి ఒక రిపోర్ట్ విడుదల చేశారు. శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన ప్రస్తుతానికి బాగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఎలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదని ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడం కోసం కొంత సమయం పడుతుంది అని వైద్యులు చెప్పారని చెప్పుకొచ్చారు.
ఇక ఆయన కోలుకునేందుకు ఆయన అభిమానులు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారని వారందరికీ ధన్యవాదాలు అని శరత్ బాబు సోదరుడి కుమారుడు వెల్లడించారు. నిజానికి ఆయన మరణించారని దాదాపుగా సినీ సెలబ్రిటీలు కూడా నమ్మేశారు. కుష్బూ సుందర్, కమల్ హాసన్ వంటి వారు శరత్ బాబు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తర్వాత ఆయన బ్రతికున్నారని విషయం తెలుసుకుని వెంటనే సోషల్ మీడియా నుంచి ఆ పోస్టులు డిలీట్ చేశారు.

నిజానికి ఆయన హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారనే వార్త ముందుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తరువాత తమిళ మీడియాలో పెద్ద ఎత్తున ఆయన చనిపోవాలనే వార్తలు రావడంతో తెలుగు మీడియాలో కూడా కొంత ఆయన చనిపోయినట్లు వార్తలు బయటకు వచ్చాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే రంగంలోకి దిగి ఆయన చనిపోలేదని ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

నిజానికి ఆయన ఆరోగ్యం విషమించడంతో ముందుగా బెంగళూరులోని ఒక హాస్పిటల్ లో జాయిన్ చేసి కొన్నాళ్లపాటు వైద్యం అందించారు. అయితే అక్కడ ఆరోగ్య పరిస్థితి మెరుగకపోవడంతో అక్కడి వారి సూచనలు మేరకు ఆయన హైదరాబాదులోని ఏఐజీ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. గత కొన్నాళ్ల నుంచి ఆయన హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరలోనే మన ముందుకు వచ్చి మాట్లాడతారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వారు చెబుతున్నది జరగాలని సినీ ప్రముఖులు సైతం కోరుకుంటున్నారు.