Health

నెల రోజులు పరగడపున ఒక్క గ్లాసు తులసి నీరు తాగితే చక్కెర వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది.

కొన్ని తులసి ఆకులను నీటిలో నానబెట్టి, రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం ఖాళీ కడుపుతో తులసి నీటిని త్రాగాలి. అయితే ముందుగా తులసి నీటిని కూడా తయారు చేసుకోవచ్చు దానిని నిల్వ చేయవచ్చు. రోజంతా సేవించవచ్చు. ఓ గ్లాసు నీళ్లలో తులసి ఆకులు కొన్ని వేసి ఉడికించాలి. ఆ తరువాత ఆ నీటిని వడపోసి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తాగాలి. ఇలా చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తులసి నీళ్లు గానీ మీ డైట్‌లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. తులసి ఆకులతో టీ కూడా చేసుకుని తాగినా ఫలితం ఉంటుంది. అయితే నేటి ఆధునిక జీవనశైలి కారణంగా ప్రజలు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.

జీవనశైలి వ్యాధుల్లో ఎక్కువమందిని వేధించే సమస్య డయాబెటిస్ లేదా మధుమేహం. ఇది చాలా మందిలో సాధారణమైపోయింది. క్రమరహిత ఆహారపు అలవాట్లు, జంక్‌ ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం.. వంటి కారణాల వల్ల చెడు కొవ్వులు శరీరంలో పోగవుతున్నాయి. ఫలితంగా రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతోంది. చివరకు ఇది మధుమేహానికి దారితీస్తుంది. శరీరం గ్లూకోజ్‌ను సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోతే రక్తంలో చక్కెర శాతం స్థిరంగా ఉండదు. దీన్నే డయాబెటిస్ లేదా చక్కెర వ్యాధి అంటారు.

షుగర్ నియంత్రించకపోతే గుండె వైఫల్యం, హార్ట్ స్ట్రోక్, కిడ్నీలు విఫలం కావడం చివరకు అపస్మారక స్థితిలోకి వెళ్లడం లాంటి పరిస్థితులు తలెత్తుతాయి. దీన్ని నివారించాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఒక్కటే మార్గం. మన పూర్వీకులు సహజంగా లభ్యమయ్యే మూలికలు, ప్రకృతి ఆహారాలను తీసుకోవడం వల్ల ఇలాంటి అనారోగ్యాన్ని నివారించగలిగారు. అందుకే ఒకప్పుడు ఇళ్లల్లో వేప చెట్టు, తులసి మొక్కలు తప్పకుండా ఉండేవి. ముఖ్యంగా తులసిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆధునిక వైద్యశాస్త్రం కూడా ఇప్పుడిప్పుడే తులసి ప్రాముఖ్యతను గుర్తిస్తోంది.

మెసిడోనియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైంటిస్ట్స్ ప్రచురించిన ఓ అధ్యయనంలో తులసి వల్ల డయాబెటిస్ ను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఎలుకలపై చేసిన పరిశోధనలో ఈ విషయం గురించి నిగ్గు తేల్చారు. ఈ అధ్యయనాన్ని Express.co.uk అనే పోర్టల్‌లో ప్రచురించారు. విటమిన్లు పుష్కలంగా ఉండే తులసి ఆకులు.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయని స్పష్టం చేశారు. పరిశోధకులు ఏం గుర్తించారు.. డయాబెటిస్ ఉండే ఎలుకల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పరిశోధకులు అంచనా వేశారు.

తులసి ఆకుల నుంచి సంగ్రహించిన ఎథనాల్ ఎలుకలపై మంచి ప్రభావం చూపిందని, 30 రోజుల పాటు సాగిన ఈ పరిశోధన ఫలితంలో రక్తంలో చక్కెర స్థాయి 26.4 శాతం తగ్గిందని కనుగొన్నారు. జీవక్రియపై ఒత్తిడిని కూడా తులసి నియంత్రించిందని.. బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ స్థాయిల నిర్వహణకు సహాయపడుతుందని గుర్తించారు. తులసి వల్ల పాంక్రియాటిక్ బీటా కణాల పనితీరు, ఇన్సులిన్ స్రవించే విధానం మెరుగుపడుతుందని ఇతర అధ్యయనాల్లో తేలింది. తులసి ఆకుల్లో హైపోగ్లైసిమిక్ లక్షణాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. దీంతోపాటు మధుమేహ సమస్యలను నివారించడంలో తోడ్పడతాయి.

టైప్-2 డయాబెటిస్ చికిత్సపై అధ్యయనం.. బరోడా ఎంఎస్ వర్సిటీలోని ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగం కూడా ఇలాంటి అధ్యయనమే నిర్వహించింది. డయాబెటిక్ ఎలుకల రక్తంలో చక్కెర స్థాయిలు, సీరం లిపిడ్స్, కణాజాల లిపిడ్స్ పై తులసి ప్రభావం చూపిందని పరిశోధకులు గుర్తించారు. నెల రోజుల పాటు సాధారణ, డయాబెటిక్ ఎలుకలకు ఆహారంలో ఒక శాతం తులసి ఆకు పొడిని తినిపించారు. ఫలితంగా రక్తంలో చక్కెర, యూరోనిక్ యాసిడ్, అమైనో ఆమ్లాలు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, లిపిడ్లు గణనీయంగా తగ్గడం గమనించారు. మధుమేహం తగ్గడానికి తులసి మెరుగైన ఔషధమని జర్నల్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker