Health

చేతులు, కాళ్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే అది ఖచ్చితంగా..

చాలామంది కేవలం రుచి కోసమే పలు వంటకాలను చేసుకుని వాటిని ఆస్వాదిస్తుంటారు. అయితే చాలా వరకు వంటకాలు ఏవైనా సరే.. ఉప్పు లేకుండా వాటికి రుచికాదు. తీపి పదార్థాలు పక్కన పెడితే మిగిలిన కూరలు, ఇతర ఏ వంటకంలోనైనా సరే.. ఉప్పు తప్పని సరిగా ఉపయోగించాలి. ఉప్పు మంచిదే.. అందుకని మోతాదుకు మించి తీసుకుంటే.. అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొంతమంది తమకు తెలియకుండానే అధికంగా ఉప్పును తినేస్తూ ఉంటారు.

బయట దొరికే ఆహారాలలో కూడా ఉప్పు అధికంగానే ఉంటుంది. ఎక్కువకాలం నిల్వ ఉండాలన్న కారణంగా పచ్చళ్ళు , బ్రెడ్లు, సాస్‌లు వంటి వాటిలో అధికంగా ఉప్పును వేసి అమ్ముతున్నారు. అయితే ఇలా దీర్ఘకాలంలో ఉప్పును అధికంగా తినడం వల్ల మీకు తెలియకుండానే శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. అవి దీర్ఘకాలంగా కొనసాగితే అనారోగ్యం బారిన పడడం పక్కా. ఉప్పు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది.. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉంటుంది.

ఆ నీరు కణజాలంలోకి చేరి అక్కడ వాపునకు కారణం అవుతుంది. దీనివల్ల శరీరం ఉబ్బినట్టు కనిపిస్తుంది. శరీరంలో అదనపు సోడియం నిలిచిపోతుంది. శరీరంలో ఉప్పు అధికంగా చేరిందంటే 24 గంటల్లో మీకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అలాంటప్పుడు వెంటనే వైద్యుణ్ని కలిసి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. సోడియం శరీరంలో అధికంగా చేరితే చేతులు, కాళ్లల్లో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు వైద్యులు. చేతివేళ్లు, అరచేయి వాచినట్టు అవుతుంది. పాదాలు, మడమల్లో కూడా వాపులు వస్తాయి.

దీన్నే ఎడెమా అని పిలుస్తారు. ఎక్కువ సేపు కూర్చున్నా, సుదీర్ఘ ప్రయాణాలు చేసినా… ఇలా కాళ్లు, చేతుల్లో వాపు రావడం సహజం. కానీ సాధారణం సమయంలో కూడా చేతులు, పాదాలు, మడమల్లో వాపు కనిపిస్టే మాత్రం మీరు ఉప్పు అధికంగా తీసుకుంటున్నట్టు లెక్క. ఇలా ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉప్పు శరీరంలో అధికంగా చేరితే రాత్రి ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. కిడ్నీలపై భారం పడుతుంది. మూత్రంతో పాటు పోషకాలు కూడా బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది.

కాబట్టి ఉప్పును పరిమితంగానే తినాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసుల మేరకు వయోజనులైతే రోజుకు 2000 ఎంజీ సోడియం సరిపోతుంది. అంటే 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు మాత్రమే సరిపోతుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా సగటున 4000 ఎంజీ సోడియం లేదా 10.78 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు, అధిక రక్తపోటు, స్ట్రోక్ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker