Health

అతి నిద్ర వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా..? మీ గుండె కాకుండా మెదడు కూడా..?

తక్కువగా నిద్రపోవడమే కాదు, ఎక్కువగా లేదా అతిగా నిద్రించడం కూడా ఆరోగ్యానికి హానికరమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును, రోజుకి 7 నుంచి 9 గంటల కంటే ఎక్కువగా నిద్రించేవారిని అనేక రకాల రుగ్మతలు వెంటాడతాయని వారు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వీకెండ్స్‌లో అతిగా నిద్రించకుండా విశ్రాంతి కోసం గంట కంటే తక్కువ సమయం నిద్రించేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో అతడికి కచ్చితంగా విశ్రాంతి అవసరం.

అప్పుడే అతడు మరునాడు చురుకుగా ఉంటాడు. లేదంటే బలహీనంగా, నీరసంగా కనిపిస్తాడు. ఆరోగ్యకరమైన పెద్దలు రోజూ 7 నుంచి 8 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల రోజంతా అలసట తొలగిపోయి తాజాగా అనిపిస్తుంది. తక్కువ నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదని అందరికి తెలుసు, అలాగే అతి నిద్ర కూడా ఆరోగ్యానికి హానికరం. గుండె జబ్బులు.. మీరు రోజులో 8 గంటల నిద్ర తర్వాత కూడా మేల్కొనకపోతే అలారం లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి.

ఎందుకంటే ఎక్కువసేపు నిద్రపోతే గుండె ప్రమాదంలో పడుతుంది. ఇది కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. తలనొప్పి.. తగినంత నిద్ర తీసుకుంటే అలసట, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ ఎక్కువగా నిద్రపోయే అలవాటు ఉంటే తలనొప్పి మరింత పెరుగుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ చెడు అలవాట్లను వదిలించుకోండి. డిప్రెషన్.. తక్కువ నిద్రపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతారని అందరికి తెలుసు.

కానీ ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్రను అదుపు చేసుకోలేని వ్యక్తులు తరచుగా డిప్రెషన్‌కు గురవుతారు. స్థూలకాయం పరిమితికి మించి నిద్రపోయినప్పుడు శారీరక శ్రమలకు సమయం దొరకదు. ఈ పరిస్థితుల్లో పొట్టలో, నడుము చుట్టూ, కొవ్వు పెరుగుతుంది. తరువాత ఇది మధుమేహం, అధిక రక్తపోటుకు కారణమవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker