పానీపూరీ అంటే ఇష్టమా..! ఇలాంటి పానీపూరీ తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు.

మన దేశంలో ఎక్కువగా పానీపూరీ స్టాల్స్ ఉంటాయి. అయితే కొందరు పానీపూరీ అనారోగ్యకరమైనదని చెబుతున్నా.. ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు మరి కొంత మంది నిపుణులు. పానీపూరీ తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. పానీపూరిలో ఉపయోగించే నీరు చాలా వేడిగా, కారంగా, రుచిగా ఉంటుంది. ఇది ఆకలి కాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అయితే పానీపూరీ అంటే ఇష్టపడనివారు చాలా తక్కువ. ముఖ్యంగా అమ్మాయిలు పానీపూరీలను ఎక్కువగా ఇష్టపడతారు.
ఎన్ని రకాల వంటలు ఉన్నా, పానీ పూరీ కనిపిస్తే చాలు దానిని తినకుండా ఉండలేరు. అయితే, పానీపూరీ చూటానికి సింపుల్ గా కనపడినా, అది కంప్లీట్ గా జంక్ ఫుడ్. ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. కానీ, దానిని కూడా హెల్దీగా మార్చుకొని తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. గోధుమ పూరీలను ఎంచుకోండి.. పానీపూరీలను మైదా పిండితో కాకుండా, గోధుమలతో చేసిన ఆరోగ్యకరమైనదాన్ని ఎంచుకోండి. మీరు గోధుమలతో ఇంట్లో పూరీలను కూడా తయారు చేసుకోవచ్చు.
అప్పుడు వాటిని తినడానికి పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్యకరమైన ఫైలింగ్‌లను ఎంచుకోండి.. సాధారణంగా మెత్తని బంగాళాదుంపలను పానీపూరీలో ఫిల్ చేయడానికి ఉపయోగిస్తారు. దీనికి బదులుగా, గింజలను ఫిల్లర్లుగా ఉపయోగించండి. మీరు ఉడకబెట్టిన చనా లేదా మొలకలను గోల్గప్పే ఫిల్లర్లుగా ఉపయోగించవచ్చు. వీటికి మసాలా దినుసులు వేసి రుచిగా చేసుకోవచ్చు. చిరుతిండిగా పానీపూరీ తినండి.. పానీపూరీ కోసం సమయాన్ని నిర్ణయించండి.
మధ్యాహ్న భోజన సమయంలో వీటిని తినవద్దు ఎందుకంటే ఈ సమయంలో మీరు వీటిని ఎక్కువగా తినవచ్చు. సాయంత్రం సమయంలో తినండి; ఎక్కువగా సాయంత్రం 5-6 గంటలకు తినడం బెటర్. ఉప్పు ఎక్కువగా ఉపయోగించవద్దు.. మీకు అధిక రక్తపోటు సమస్యలు ఉంటే, పూరీలలో, మసాలా నీటిలో ఉప్పును తగ్గించండి. సాధారణంగా మార్కెట్‌లో లభించే చాట్ మసాలాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది.
చాట్ మసాలాను ఉపయోగించడం మానుకోండి. చింతపండు, పచ్చిమిర్చి, పుదీనా, బెల్లం, కొద్దిగా ఉప్పును ఉపయోగించి కారంగా ఉండే నీటిని సిద్ధం చేయండి. పూరీలను కాల్చండి.. సాంప్రదాయ పద్ధతిలో పూరీలను వేయించడానికి బదులుగా, మీరు వాటిని కాల్చవచ్చు. చాలా మంది వ్యక్తులు పూరీలను ఎయిర్ ఫ్రయ్యర్ ఉపయోగించవచ్చు. నూనెలో కాకుండా, ఇలా ప్రయత్నించి చూడండి.