రోజూ పచ్చి మిరపకాయలను తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా..?

మిరపకాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వుండవని వెల్లడించారు ఇటలీ పరిశోధకులు. మిరపకాయలు ఎక్కువగా తీసుకుంటే గుండె పోటు రాకుండా 40 శాతం వరకు తగ్గించవచ్చని వారు పేర్కొన్నారు. అందుచేత రోజుకు రెండేసి మూడేసి మిరపకాయలను వంటల్లో తప్పక చేర్చుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. మిరపకాయల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గించే ‘క్యాప్‌సేసియన్’ అనే పదార్థం ఉంటుందని దీని వల్ల గుండెకు రక్షణ కలుగుతోందని ఇటలీ పరిశోధకులు గుర్తించారు.
అయితే అవును పచ్చిమిర్చిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పదార్థాలు ఉంటాయి. పలు పరిశోధనల ప్రకారం.. పచ్చిమిర్చిలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో వృద్ధాప్య సంకేతాలు మన చర్మంపై ఆలస్యంగా కనిపిస్తాయి. ఈ కొల్లాజెన్ మన చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. అలాగే మన చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపించడానికి సహాయపడుతుంది. పచ్చిమిర్చిలో ముఖ్యమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.. పచ్చి మిరపకాయలల్లో మన శరీరానికి అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
ముఖ్యంగా వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే దీనిలో ఉండే విటమిన్ ఎ మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మెటబాలిజం బూస్టర్.. పచ్చిమిరపకాయలో వేడికి కారణమయ్యే క్యాప్సైసిన్ అనే సమ్మేళనం కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మన జీవక్రియ తాత్కాలికంగా పెరుగుతుంది.
ఇది కేలరీలను ఎక్కువగా బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు. నొప్పి నివారణ.. పచ్చిమిరపకాయలో క్యాప్సైసిన్ ఉంటుంది. దీనిలో నొప్పిని తగ్గించే సహజ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని ఆర్థరైటిస్, కండరాల నొప్పికి సమయోచిత క్రీములలో ఎక్కువగా ఉపయోగిస్తారు. జీర్ణ ఆరోగ్యం.. పచ్చిమిరపకాయలు జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది.
కొంతమందిలో అజీర్ణం, ఉబ్బరం లక్షణాల నుంచి ఉపశమనం పొందటానికి కూడా ఇవి సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు.. పచ్చిమిర్చిలో బీటా కెరోటిన్, క్యాప్సైసిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావానని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయి.