News

పవన్ కళ్యాణ్‎ డాక్టరేట్ తీసుకోకపోవడానికి అసలు కారణం ఇదే.

పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూ..మరోవైపు జనసేన పార్టీతో రాజకీయాలు కూడా చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ తన సినిమాల షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చి పూర్తిగా తన టైంని పార్టీ కోసమే కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. పాలిటిక్స్ కారణంగా పవన్ అన్ని సినిమా షూటింగ్స్‎కి విరామం ప్రకటించారు. హరిహర వీరమల్లు తో పాటు మరో రెండు సినిమాలు సగం షూటింగ్‎లో ఉన్నాయి. వీటికి ఏపీ ఎన్నికల తరువాతే తిరిగి ప్రారంభం కానుంది.

ప్రస్తుతం పూర్తి ఫోకస్ ఏపీ ఎన్నికలపైనే పెట్టారు జనసేనాని. ఇప్పటికే ఆయన నటించాల్సిన చాలా వరకు సినిమాలు పెండింగ్‎లో ఉన్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పవన్ పూర్తి సమయాన్ని పార్టీ కోసమే కేటాయిస్తున్నారాయన. అయితే పవన్ కళ్యాణ్‎కి తాజాగా ఒక ఉన్నతమైన, అరుదైన గౌరవం దక్కింది. పవర్ స్టార్ బిరుదుకు డాక్టరేట్ జత కాబోతుంది. తమిళనాడులోని వేల్స్ యూనివర్సిటీ పవన్ కళ్యాణ్‎కి డాక్టరేట్ ఇచ్చేందుకు ఆయన పేరును ఎంపిక చేసింది.

దీనికి కారణం గతంలో ఆయన చేసిన సహాయక, సేవా కార్యక్రమాలే అని చెప్పాలి. జనవరిలో జరగబోయే తమ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవాలకు హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా ఆహ్వానించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆనందంతో పొంగిపోతారు. కానీ పవర్ స్టార్ మాత్రం యూనివర్సిటీ వాళ్లకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. వివిధ రంగాలలో రాణించిన గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారని వారికి డాక్టరేట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు.

తనకు ఇస్తున్న డాక్టరేట్‎ని సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయాన్ని వేల్స్ యూనివర్సిటీ యాజమాన్యానికి తెలియజేస్తూ ఒక లేఖ రాశారు. తనని వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్‎కి ఎంపిక చేయడం సంతోషంగా ఉందని పవన్ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఈ డాక్టరేట్‎ను గౌరవంగా భావిస్తానన్నారు పవన్. అయితే తనకన్నా గొప్పవారు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారని తెలిపారు. వారిని గుర్తించి ఈ డాక్టరేట్ ను ప్రధానం చేయాల్సిందిగా కోరారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలల్లో బిజీగా ఉన్నట్లు తెలిపారు.

వేల్స్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవానికి హాజరు కాలేకపోతున్నట్లు పవన్ లేఖలో పేర్కొన్నారు. ఇక కట్ చేస్తే డాక్టరేట్ బిరుదును అందుకునే అవకాశం చాలా కొద్దిమందికే వస్తుంది. కానీ పవన్ ఈ బిరుదును తిరస్కరించాడన్న వార్త విన్న అభిమానులు కాస్త నిరాశ చెందారు. అవార్డులు తన వద్దకే వచ్చినప్పటికీ వాటిని అలా పక్కన పెట్టడం అంటే మామూలు విషయం కాదని.. ఇలాంటి సాహసం కేవలం పవన్ కళ్యాణ్‎కి మాత్రమే సాధ్యం అంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker