News

ఎన్నికల ఖర్చుకోసం ఆస్తులు అమ్మేస్తున్న పవన్ కల్యాణ్. షాక్ లో మెగా ఫ్యామిలీ.

రాబోయే ఎన్నికల ఖర్చుకోసం ఇళ్ల స్థలాలు అమ్మడానికి పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 20 కోట్ల రూపాయల స్థలాన్ని ఇప్పటికే అమ్మేశారు. పవన్ నుంచి ఓ పారిశ్రామికవేత్త ఈ స్థలం కొన్నట్టు తెలుస్తోంది. మరికొన్ని ఆస్తులు అమ్మేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఈ మధ్య జనసేన పార్టీ నిర్వహణకు… ఫ్లైట్లలో తిరగడానికి 20 కోట్ల రూపాయల దాకా ఖర్చయ్యాయి. అయితే ప్రజల సమస్యలను తెలుసుకొని ఎంతో అద్భుతమైన జీవితాన్ని వదిలేసి.. పార్టీ ప్రారంభించాడు. కానీ, మొదట్లో రాజకీయాలు చేయడం, ప్రతిపక్షం పై విమర్శలు గుప్పించడం పవన్ కు చేతకాలేదు.

అంతేకాకుండా మొదటిసారి ఎన్నికల్లో సొంత అభిమానులే ఆయనను ఓడించారు. ఇక పార్టీని నడపడం కోసం.. ఎవరి దగ్గర చేయి చాచకుండా.. సినిమాలు చేసి.. వాటిపై వచ్చిన డబ్బుతో పార్టీని నడుపుతున్నట్లు పవన్ అధికారికంగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన బిడ్డల కోసం దాచిన డబ్బును కౌలు రైతుల సహాయార్థం ఇచ్చేశారు. ఇలా ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క రాజకీయాలు చేస్తూ.. రెండు పడవలపై ప్రయాణం సాగిస్తూ వస్తునన్నారు పవన్. ఇక అలా టీడీపీతో పొత్తుకు సై అనడం, ఈ మధ్యనే జనసేనకు 24 సీట్లు కేటాయించడం జరిగింది.

ఎలక్షన్స్ అంటే మాటలు కాదు. డబ్బు కచ్చితంగా ఉండాలి. ఇక్కడ కూడా పవన్ కు సినిమాలే దిక్కు అవుతాయి అనుకున్నా.. సమయం తక్కువ ఉంది. ముందు డబ్బు తీసుకొని ఆ తరువాత సినిమా చేయకపోతే నిర్మాతలు నష్టపోతారని సినిమాల జోలికి పోకుండా పవన్ తన సొంత ఆస్తులను అమ్మే ప్రయత్నాల్లో ఉన్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే పవన్ తన ఇంటిని అమ్మేసిన విషయం తెల్సిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హైదరాబాద్ లో ఆయన పేరు మీద ఉన్న రెండు స్థలాలను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం.

ఎలక్షన్స్ సమయం లోపు రూ. 100 కోట్ల వరకు పోగు చేయాలనీ చూస్తున్నాడట. డబ్బు కోసం విరాళాలు అడగడం, ఇవ్వకపోతే ఫీల్ అవ్వడం కన్నా సొంత ఆస్తులను అమ్ముకొని పోటీ చేయడం ఉత్తమమని పవన్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని అభిమానులు షాక్ అవుతున్నారు. పార్టీని నడపడానికి కూడా కష్టపడుతున్నాడు అంటే.. ఆయనలో ఎంతో కొంత నిజాయితీ ఉందని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker