Health

ఈ చిట్కాలు పాటిస్తే ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు, గుంత‌లు అన్ని వారంలో తగ్గిపోతాయి.

యుక్త వయసులోనే కాకుండా 25 నుండి 35 ఏళ్ల వయసులోనూ మొటిమలు కనిపిస్తుంటాయి. టీనేజీలో హార్మోన్లు ప్రభావం కారణంగా ఎక్కువగా మొటిమలు వస్తుండగా.. నడి వయసులో ఉన్నవారికి ప్రీ–మెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌ వల్ల కూడా మొటిమలు వస్తుంటాయి. అయితే అయితే ఒక చ‌క్క‌టి చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా ముఖంపై వ‌చ్చే మొటిమ‌ల‌ను అలాగే వాటి వ‌ల్ల క‌లిగే మ‌చ్చ‌లను, గుంత‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గాను న‌ల్ల మ‌ట్టిని తీసుకోవాలి. త‌రువాత దీనిని మెత్త‌గా న‌లగొట్టి జ‌ల్లించాలి. ఇలా జల్లించ‌గా వ‌చ్చిన మెత్త‌ని మ‌ట్టిని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ న‌ల్ల‌మ‌ట్టిని ముఖానికి మాస్క్ లాగా వేసుకోవాలి.

త‌రువాత దీనిని పూర్తిగా ఆరిన త‌రువాత ముఖాన్ని శుభ్రంగా క‌డుక్కోవాలి. న‌ల్ల‌మ‌ట్టిని ముఖానికి రాసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం చ‌ల్ల‌బ‌డుతుంది. చ‌ర్మం చ‌ల్ల‌బ‌డ‌డం వ‌ల్ల ముఖానికి ర‌క్తం చ‌క్క‌గా స‌ర‌ఫ‌రా అవుతుంది. అలాగే ముఖ చ‌ర్మంలో పేరుకుపోయిన మ‌లినాలు తొల‌గిపోతాయి. చ‌ర్మంపై ఉండే జిడ్డు తొల‌గిపోతుంది.

ఈ విధంగా ముఖానికి మ‌ట్టితో ప్యాక్ ను వేసుకోవ‌డం వ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గుతుంది. అలాగే ఈచిట్కాను పాటించ‌డంతో పాటు నీటిని ఎక్కువ‌గా తాగాలి. తాజా పండ్ల‌తో చేసిన జ్యూస్ ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ను నీటిలో నాన‌బెట్టి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల వ‌ల్ల క‌లిగే గుంత‌లు త్వ‌ర‌గా తొల‌గిపోతాయి.

వీటితో పాటు మొటిమ‌ల‌ను గిల్ల‌కూడ‌దు. వాటంత‌ట అవి ప‌గిలే వార‌కు వాటిని ముట్టుకోకూడ‌దు. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా మొటిమ‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker