Health

ఈ ఆకుల రసాలు తాగితే ప్లేట్ లెట్లు ఒక్కసారిగా పెరిగిపోతాయి.

ప్లేట్ లెట్స్ ఎముక మూలగ నుండి పుడతాయి. వీటి జీవితకాలం నాలుగ రోజులు. ఎముక మూలగలో ఏదైన సమస్య ఉత్పన్నమయ్యే సందర్భంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గుతుంది. ఇది సాధారణంగా జరిగేదే. ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిన సందర్భంలో రక్తం గడ్డగట్టే ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. రక్తం గడ్డకట్టే జీవ క్రియల్లో ప్లేట్ లెట్స్ లోని ప్రొటీన్లతో కలసి పనిచేస్తాయి. వీటిని క్లాంటింగ్ ఫ్యాక్టర్స్ అని పిలుస్తారు. గాయం అయిన 2నుండి 3 నిమిషాల్లో ఈ వలయం కారణంగా రక్తం ప్రవహించకుండా ఆగిపోతుంది.

అయితే ప్రస్తుతం మారిన వాతావరణం కారణంగా చాలా మంది జ్వరాల బారిన పడుతున్నారు. ఇవి కాస్తా డెంగీగా మారుతున్నాయి. అయితే కొంత మందిలో తగిన చికిత్స తీసుకోగానే తగ్గిపోతుంది. కానీ మరికొంత మందిలో మాత్రం తీవ్రంగా పరిణమిస్తుంది. రక్త స్రావం, రక్తం చిక్కబడటం, ప్లేట్ లెట్ల పడిపోవడం వంటివి కనిపిస్తాయి. డెంగీ జ్వరం వస్తే.. ఒళ్లంతా నొప్పులు, తీవ్రంగా జ్వరం, వణికిపోడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ జ్వరం వచ్చిన వారిలో ఎక్కువగా ప్లేట్ లెట్ల పడిపోతూంటాయి. ప్లేట్ లెట్ల పడిపోవడం అంటే ప్రాణం మీదకి వచ్చినట్టే.

అయితే ప్లేట్ లెట్ల సంఖ్య పెంచడానికి కొన్ని రకాల ఆకులు బాగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఆకులు.. రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య పెంచడానికి బొప్పాయి ఆకులు బాగా హెల్ప్ చేస్తాయి. వీటి రసం కానీ, కషాయం కానీ తాగితే ప్లేట్ లెట్ల కౌంట్ వెంటనే పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటి రసం తాగడం వల్ల ప్లేట్ లెట్ల సంఖ్య పెరగడమే కాకుండా జ్వరం కూడా తగ్గుతుంది. వేప ఆకులు.. వేప ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.

కాబట్టి వేప ఆకుల్ని తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్ల కౌంట్ అనేది తగ్గుతుంది. వేపాకుల్ని నీటిలో మరిగించి.. ఆ నీటిని తాగడం వల్ల.. ప్లేట్ లేట్ల సంఖ్య పెరగడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జామ ఆకులు.. జామ ఆకుల్లో కూడా యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి జామ ఆకుల్ని తీసుకున్నా ప్లేట్ లెట్లను పెంచుకోవచ్చు.

రెండు గ్లాసుల నీటిలో.. జామ ఆకులు వేసి సగం అయ్యేవరకు మరిగించుకోవాలి. ఇవి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తేనె కలుపుకుని తాగిలి. ఇలా రోజుకు మూడు సార్లు తాగితే.. ప్లేట్ లెట్లను పెంచుకోవచ్చు. డెంగీని తగ్గించుకోవచ్చు. ఈ ఆకులతో పాటు డాక్టర్లు ఇచ్చే మందులను కూడా వేసుకుంటే డెంగీని అదుపులోకి తీసుకురావచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker