Health

మీ టూత్ బ్రష్‌ను ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా..? మర్చకుంటే చిగుళ్లు దెబ్బతిని పళ్లు కూడా..?

వాస్తవానికి.. చాలామంది బ్రిస్టల్స్ పూర్తిగా అరిగిపోయే వరకు టూత్ బ్రష్ ఉపయోగించడం మానేయరు.. అయితే, అలా చేయడం వల్ల మీ నోటి ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ దంతాలను మెరిసేలా చేసే బ్రష్ కొంత సమయం తర్వాత దంతక్షయాన్ని కూడా కలిగిస్తుంది.. అటువంటి పరిస్థితిలో దానిని సమయానికి మార్చేయడం చాలా అవసరం. టూత్ బ్రష్ నోటి ఆరోగ్యానికి హానికరం. అయితే పొద్దున్నే నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ చేసే పని, పళ్లు తోముకోవడం. చాలామంది ఇందుకు టూత్ పేస్ట్, టూత్ బ్రష్‌లను ఉపయోగిస్తారు. అయితే కొందరు బ్రష్‌ను కొన్ని నెలల పాటు వాడతారు.

పళ్లు తోమలేని స్థితికి వచ్చినా అలాగే ఉపయోగిస్తారు. అయితే ఒకే టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడకూడదని డెంటిస్టులు చెబుతున్నారు. దంతాలు, చిగుళ్లు, నాలుకను శుభ్రం చేయడానికి టూత్ బ్రష్‌ వాడతారు. నోటి పరిశుభ్రతకు అవసరమైన ముఖ్యమైన టూల్ ఇది. బ్రష్ ఎప్పుడు మార్చాలి.. కొన్ని నెలలు, సంవత్సరాల పాటు ఒకే బ్రష్‌ వాడితే నోటి ఆరోగ్యం క్షీణిస్తుంది. బ్యాక్టీరియా వ్యాప్తి పెరిగి లేనిపోని సమస్యలు రావచ్చు. చిగుళ్లు దెబ్బతిని పళ్లు బలహీనంగా మారవచ్చు. అందుకే బ్రష్‌ను తరచుగా మారుస్తూ కొత్తదాన్ని వాడాలి.

ప్రతి ఒక్కరూ తమ టూత్ బ్రష్‌ను ప్రతి రెండు, మూడు నెలలకోసారి మార్చుకోవాలని చెప్పారు న్యూఢిల్లీలోని పితంపురలోని గులాటి డెంటల్ క్లినిక్‌ డెంటిస్ట్, డాక్టర్ వైభవ్ గులాటి. అలాగే బ్రష్ షేప్‌ చెక్ చేయాలని, అది ఏమాత్రం దెబ్బతిన్నా, పాడైనా, వెంటనే బ్రష్‌ను మార్చాలని సూచించారు. డాక్టర్ వైభవ్ గులాటి మీడియాతో మాట్లాడుతూ.. సున్నితమైన చిగుళ్లు ఉన్నవారు మృదువైన బ్రిస్టల్స్ ఉండే బ్రష్‌లు వాడాలన్నారు. లేదంటే మీడియం బ్రిస్టల్స్ బ్రష్‌లు వాడొచ్చని, కానీ హార్డ్ బ్రిస్టల్స్ ఉండేవి వాడకపోవడం మంచిదని చెప్పారు.

మంచి ఓరల్ హెల్త్ కోసం ప్రతి ఒక్కరూ రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలని సూచించారు. ఉదయం నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేస్తే దంతాలు శుభ్రంగా ఉంటాయని, దీంతో డెంటల్ లేదా ఓరల్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గుతుందని వివరించారు. ఎక్కువ కాలం వాడితే ఏమవుతుంది..ఒకే టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడటం ప్రమాదకరమని డాక్టర్ వైభవ్ చెబుతున్నారు. దీనివల్ల బ్రష్‌పై బ్యాక్టీరియా పేరుకుపోతుందని, అది వృద్ధి చెందే రేటు కూడా పెరుగుతుందని చెప్పారు.

బ్రష్ చేసేటప్పుడు బ్యాక్టీరియా నోటి లోపల వ్యాపించి అనారోగ్యాలకు కారణం కావచ్చని వివరించారు. దీంతో నోటి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు జీర్ణక్రియకు కూడా హాని కలుగుతుందన్నారు. షేప్ సరిగా లేని బ్రష్‌లతో పళ్లు తోముకుంటే దంతాలు సరిగా శుభ్రం కావు. అవి చిగుళ్లను దెబ్బతీయవచ్చు. బలంగా బ్రషింగ్ చేయడం కూడా మంచిది కాదు. అందుకే చాలా జాగ్రత్తగా పళ్లు తోముకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker