News

డ్రగ్స్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పోలిసులకు దొరికిపోయిన షణ్ముఖ్ జస్వంత్.

డాక్టర్ మౌనిక అనే యువతిని మోసం చేసి.. మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు సంపత్. ఆరు రోజుల్లో తనతో పెళ్లి అనగా.. మరో యువతిని వివాహం చేసుకోవడంతో మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడి ప్రశ్నించేందుకు ఫ్లాట్‌కు వెళ్లగా..అక్కడ షణ్ముఖ్ గంజాయి తీసుకుంటూ దొరికిపోయాడు. పూర్తీ వివరాలోకి వెళ్తే బిగ్ బాస్ కంటెస్టంట్, సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జస్వంత్ మరో కేసులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే షణ్ముఖ్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో చిక్కుకుని అప్పట్లో సంచలనం సృష్టించగా.. ఇక లేటెస్ట్‌గా డ్రగ్ కేసులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వేరే కేసు విషయంలో షణ్ముఖ్ సోదరుడి ఇంటికి వెళితే.. అక్కడ ఈ సోషల్ మీడియా స్టార్ గంజా కొడుతూ పట్టుబడినట్లు సమాచారం అందుతోంది. దీంతో యూట్యూబర్ షణ్ముఖ్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఓ కేసులో విచారణ కోసం షణ్ముఖ్ సోదరుడి ఇంటికి వెళితే గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్ దొరికిపోయినట్లు తెలుస్తోంది.

ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. అంతలోనే మరో యువతితో వివాహం చేసుకున్నాడట షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్. ఈ కేసు విషయంలో పోలీసులు అక్కడికి వెళ్లగా.. ఆ ఫ్లాట్‌లో గంజాయితో షణ్ముఖ్ దొరికిపోయినట్లు సమాచారం. దీంతో అన్నా, తమ్ముడు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ సోషల్ మీడియా స్టార్ ఆ మధ్య మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ మూడు వాహనాలను ఢీకొట్టిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యూట్యూబ్‌లో రాత్రికి రాత్రే స్టార్ గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ వరుసగా ఇలా కేసుల్లో చిక్కుకుంటూన్నాడు. షణ్ముఖ్ జస్వంత్ కు అటు సోషల్ మీడియాలో కూడా చక్కటి ప్రజాదరణ ఉంది. వెబ్ సిరీస్ లలో ఎంతో సున్నితంగా కనిపించే షణ్ముఖ్ రియల్ లైఫ్ లో మాత్రం బ్యాడ్ బాయ్ అనే పేరు తెచ్చుకున్నాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker