టిక్ టాక్ స్టార్ దుర్గారావు పరిస్థితి ఎప్పుడు ఎలా ఉందొ తెలుసా..?

తాజాగా అందిన సమాచారం ప్రకారం దుర్గారావుకు సినిమాల్లో బంపరాఫర్ దక్కినట్లు తెలుస్తోంది. మాస్ మహరాజ్ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘క్రాక్’లో దుర్గారావు కనిపించనున్నాడట. దుర్గారావు టిక్‌టాక్ వీడియోలు చూసి ఇంప్రస్ అయిన గోపీచంద్.. అతడిని ఓ కామెడీ పాత్ర ఇచ్చాడట.
తనకు దక్కిన ఈ అవకాశాన్ని దుర్గారావు ఎలా వినియోగించుకుంటాడో చూడాలి. అయితే టిక్ టాక్ దుర్గారావు. ఈపేరు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమసో తెలియంది కాదు.. సోషల్ మీడియా యాప్ టిక్ టాక్’లో షార్ట్ వీడియో చేసి ఓ రేంజ్‌ల ఫేమస్ అయ్యాడు దుర్గరావు. ముఖ్యంగ దుర్గరావు డాన్స్ స్టెపులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

తాను వేసే స్టెప్పుల్లో కామెడీని జత చేస్తూ.. అదరగొట్టేవాడు. దీంతో ఆయన వీడియోస్ అందరికీ చేరువ అయ్యాయి. ముఖ్యంగా దుర్గారావు దంపతులు డాన్స్ చేసిన ‘నాది నక్కిలిసు గొలుసు’ అనే పాట బాగా వైరల్ అయ్యింది. ఆ పాటతో ఏకంగా దుర్గారావును ఈటీవీలో వచ్చే పాపులర్ కామెడీ షో జబర్దస్త్‌కు కూడా పిలిచారు.

అలా ఈటీవీలోనే కాకుండా పలు తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్‌లో వచ్చే షోల్లో పాల్గోంటూ మరింత పాపులర్ అయ్యాడు. దుర్గారావు వేసిన స్టెప్పులు ఎంత ఫేమస్ అంటే.. మన స్టార్ హీరోలు కూడా దుర్గా రావు చేసిన స్టెప్పులు చేసారంటే ఆయన క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఆమధ్య కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లోను అలరించాడు.

ఎప్పుడైతే టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయ్యిందో.. ఇక అప్పటి నుంచి ఆయన పాపులారిటీ తగ్గింది. షేర్ చాట్, యూట్యూబ్ షార్ట్స్ వంటీ యాప్‌ల్లో కనిపించినా.. టిక్ టాక్‌లో వచ్చినంత క్రేజ్ రాలేదు. దీంతో ఈ మధ్య పెద్దగా కనిపించడమే లేదు.