News

ప్రియాంక చోప్రా ధరించిన ఈ నెక్లేస్ ధర తెలిస్తే గుండెలు ఆగిపోవాల్సిందే..!

ప్రియాంక చోప్రా..బాలీవుడ్, హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది..మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటుంది.. అలాగే ప్రపంచంలో జరిగే ఈవెంట్స్ కూడా హాజరై సందడి చేస్తుంది.. తాజాగా రోమ్‌లో ఇటాలియన్ బ్రాండ్ యొక్క ఏటర్నా సేకరణ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో ప్రియాంక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.. అయితే భారతీయ సినీ ప్రపంచంలో హీరోయిన్ ప్రియాంక చోప్రా చాలా ప్రత్యేకం. బీటౌన్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన పీసీ.. ఇప్పుడు హాలీవుడ్ ను ఏలేస్తుంది.

అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమ వివాహం చేసుకున్న ప్రియాంక.. ఇప్పుడు అక్కడే సెటిల్ అయ్యింది. అటు హాలీవుడ్.. ఇటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ ధర హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ఓ ఈవెంట్లో మెరిసిన పీసీ అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యంత ఖరీదైన నెక్లెస్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది పీసీ. ఇక ఆమె నెక్లెస్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల ప్రఖ్యాత ఫ్యాషన్ హౌస్ బల్గారి 140వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

ఈ వేడుకలకు సినీ ప్రముఖులు, ఫ్యాషన్ డిజైనర్స్ హాజరయ్యారు. ఇక ఇదే సెలబ్రేషన్లలో ప్రియాంక సందడి చేసింది. తన బ్రాండ్ క్లాసీ ఆభరణాలను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకలకు ప్రియాంక సర్పెంటి ఏటర్నా నెక్లెస్ ధరించింది. ఇప్పుడు ఆ నెక్లెస్ ధర తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. జ్యువెలరీ హౌస్ ప్రకారం పీసీ ధరించిన నెక్లెస్ లో 140 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయట. ఈ నెక్లెస్ పూర్తి చేయడానికి దాదాపు 2800 గంటల సమయం పట్టిందట. 20 క్యారెట్ల కంటే ఎక్కువ బరువున్న వజ్రాన్ని ఏడు పియర్ ఆకారంలో కత్తిరించారు. ఈ వజ్రాలు 61.81 క్యారెట్ల బరువుతో 698 బాగెట్ డైమంట్స్ కలిపి సిన్యుయస్, త్రీ డైమెన్షనల్ వేవ్ స్ట్రక్చర్ లో సెట్ చేశారు.

మొత్తం 140 క్యారెట్ల బరువు ఉంటుందని సమాచారం. ఓ నివేదిక ప్రకారం ఈ నెక్లెస్ ధర విలువ రూ.372 కోట్లు ఉంటుందట. బల్గారికి సంబంధించిన అటెలియర్స్‌లో రూపొందించబడిన అత్యంత విలువైన ఆభరణాలలో ఈ నెక్లెస్ ఒకటి. ఈ వేడుకలలో పీసీ డెల్ కోర్ డిజైన్ కు చెందిన క్రీమ్, బ్లాక్ గౌన్ ధరించి మరింత అందంగా కనిపించింది. ఇక ఆమె ధరించిన సర్పెంటి ఏటర్నా నెక్లెస్ మరింత అట్రాక్షన్ అయ్యింది. ప్రస్తుతం పీసీ జీలే జరా చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker