Health

ఈ వయసున్న మగవారికి ఎక్కువగా వచ్చే సమస్య అదే, ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఏం చేయ్యాంటే..?

ప్రొస్టేట్ గ్రంధిని ప్రభావితం చేసే ప్రొస్టేట్ క్యాన్సర్ గురించి ముందు నుంచీ జాగ్రత్తగా ఉండాలి. మగవారిలో మూత్రాశయం కింద వాల్‌నట్ ఆకరపు చిన్న గ్రంథి ప్రొస్టేట్ గ్రంథి. ఇది సెమినల్ ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. పురుషుల్లో వచ్చే రెండో అత్యంత సాధారణ సమస్య ఇది. అయితే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్‌లో భాగమైన ప్రొస్టేట్ గ్రంథి లోని కణాలు నియంత్రణ లేకుండా పెరిగి కణితి ఏర్పడినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ప్రొస్టేట్ గ్రంథి మూత్రాశయం కింద, పురీషనాళం ముందు ఉంటుంది. ఇది వాల్‌నట్ సైజులో ఉంటుంది.

మూత్రమార్గాన్ని చుట్టుకొని ఉంటుంది, ఈ మార్గం శరీరం నుంచి మూత్రం, వీర్యాన్ని బయటకు తీసుకెళ్లే ఒక గొట్టం. ప్రొస్టేట్ గ్రంథి వీర్యంలోని భాగమైన ఒక ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ పురుషులకు వచ్చే అత్యంత సాధారణ రకాల క్యాన్సర్లలో ఒకటి. ఇది సాధారణంగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలను కలిగించకపోవచ్చు. అయితే, చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి ప్రాణాపాయంగా మారుతుంది.

లక్షణాలు.. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను తెలిపే లక్షణాల్లో మూత్రవిసర్జన ప్రారంభించడం లేదా ఆపడం కష్టంగా అనిపించడం, బలహీనమైన లేదా అంతరాయం కలిగిన మూత్ర ప్రవాహం, తరచుగా మూత్రవిసర్జన, ముఖ్యంగా రాత్రి వేళల్లో, మూత్రాశయాన్ని పూర్తిగా ఎంప్టీ చేయడంలో ఇబ్బంది, మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మంట, మూత్రం లేదా వీర్యంలో రక్తం, బ్యాక్ పెయిన్, తుంటి, పొత్తికడుపు లేదా ఎగువ తొడల్లో నొప్పి, ఎముక నొప్పి, శ్వాస ఆడకపోవడం లేదా తల తిరగడం వంటివి ఉన్నాయి. వేర్వేరు వ్యక్తులు వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటారు.

మొదటగా కొందరికి ఇలాంటి లక్షణాలు లేకుండా ఆ తర్వాత పైన పేర్కొన్న లక్షణాలు కనిపించవచ్చు. వయసు.. వృద్ధులలో, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. వయసులో ఉన్న వారికి కూడా ఈ క్యాన్సర్ ముప్పు ఉంటుంది. ఇది యుక్త వయసులో వస్తే చాలా త్వరగా వ్యాపిస్తుంది. అందుకే చిన్న లక్షణాలు కనిపించినా చాలా జాగ్రత్త పడటం మంచిది. ఫ్యామిలీ హిస్టరీ.. ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్న తండ్రి లేదా సోదరుడు ఉన్న పురుషులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.

వారికి ఎక్కువ రిస్క్.. ఇతర జాతుల పురుషుల కంటే ఆఫ్రికన్ అమెరికన్ పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా గుర్తించిన ట్యూమర్లలో ఇది కూడా ఒకటి. ఇది ఎవరికైనా సోకే అవకాశం ఉంది. ఆహారం.. రెడ్ మీట్, యానిమల్ ఫ్యాట్, డెయిరీ ప్రొడక్ట్స్ ఆహారం ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఊబకాయం.. అధిక బరువు లేదా ఊబకాయం ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ రెట్టింపు చేస్తుంది. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను ముందస్తుగా నివారించడానికి లేదా గుర్తించడానికి డాక్టర్‌ను క్రమం తప్పకుండా సంప్రదించడం ఉత్తమమైన మార్గం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker