ఈ పండు మగాళ్లకు వరమే, సహజమైన వయాగ్రా అంటున్న ఆరోగ్య నిపుణులు.
చాలా మంది అంగస్తంభన సమస్య నుంచి బయటపడేందుకు వయాగ్రా వంటి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. ఇవి ఆ సమయానికి సంతృప్తినిస్తాయి. కానీ, శాశ్వత పరిష్కారం చూపించవు. పైగా వీటిని అతిగా వేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే, వయాగ్రాను మించి పవర్‌ఫుల్ పదార్థాలు మనం ఇంట్లోనే ఉన్న విషయాన్ని చాలా మంది గ్రహించడం లేదు. వాటిని తినడం ద్వారా సహజంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అయితే రోజువారీ బిజీ లైఫ్ వల్ల అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి జీవనశైలి వ్యాధులు నానాటికి పెరుగుతున్నాయి.
అలాగే, లైంగిక జీవితం కూడా ప్రభావితమవుతుంది. వైవాహిక బాధ్యతలు, పని ఒత్తిడి, ఒత్తిడి అన్నీ శృంగార జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. చాలా మంది బిజీ లైఫ్‌లో (రోమాన్స్ లైఫ్) కోరికలను కోల్పోతారు. అంతేకాకుండా, చాలా మంది పురుషులు శీఘ్రస్కలనం, సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు పురుషులు రోమాన్స్ కు ముందు వయాగ్రా తీసుకుంటారు. ఈ ఔషధం సురక్షితం అయినప్పటికీ, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వెంటాడుతున్నాయి. అయితే.. లైంగిక శక్తిని సహజంగా కూడా పెంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు సహజ వయాగ్రాగా పుచ్చకాయను ఎంచుకోవచ్చని.. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
అయితే, కొంతమంది శృంగారం గురించి బహిరంగంగా చర్చించడానికి వెనుకాడడం అతిపెద్ద సమస్యగా మారింది. బయటకు చెప్పడం ద్వారా ఇలాంటి సమస్యలను చాలా సులభంగా పరిష్కరించవచ్చు. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మీ లైంగిక శక్తిని పెంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ధూమపానం మానేయడం నుండి ఒత్తిడిని తగ్గించడం వరకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి వ్యాయామం కీలకం. లిబిడోను పెంచడంలో ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక ఆహారంలో పుచ్చకాయ ఉంటే వయాగ్రా అవసరం ఉండదంటున్నారు.
భాగస్వామిని సంతోషపెట్టడానికి వయాగ్రా సహాయం కాకుండా.. పుచ్చకాయను తీసుకుంటే.. రోమాన్స్ లైఫ్‌ను రంగులమయం చేసుకోవచ్చంటున్నారు. వయాగ్రాకు బదులు ఈ వేసవిలో ప్రతిరోజూ పుచ్చకాయ తినాలని.. పేర్కొంటున్నారు. టెక్సాస్ A&M యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం, పుచ్చకాయ రోమాన్స్ లైఫ్ డ్రైవ్‌ను పెంచడంలో సహాయపడుతుంది. లైంగిక నపుంసకత్వాన్ని దూరం చేయడంలో పుచ్చకాయ బాగా ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. దీనిలో అర్జినైన్ కంటెంట్ లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని, అందుకే.. రెగ్యులర్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు.
అందుకే.. వయాగ్రాకు బదులుగా పుచ్చకాయను ఎంచుకోవచ్చు. అయితే ఈ వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. పుచ్చకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒత్తిడితో రోమాన్స్ లైఫ్ కు అడ్డంకిగా ఉన్నవారు కూడా పుచ్చకాయ తినవచ్చు. ఊబకాయం లైంగిక జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. అలాంటి వారు కూడా మీరు పుచ్చకాయ తినవచ్చు. ఈ పండులో 90 శాతం నీరు, కేలరీలు ఉంటాయి.. కాబట్టి బరువు పెరుగుతామన్న భయం ఉండదు. ఇలా ఈ సమ్మర్ ఫ్రూట్ మీ రోమాన్స్ లైఫ్ ను అందంగా మార్చగలదని పరిశోధకులు పేర్కొంటున్నారు.