శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన రజినీకాంత్, ప్రపోజ్ చేయడానికి వెళ్తే ఏం జరిగిందో తెలుసా..?
రజినీకాంత్ భారతీయ చలనచిత్ర నటుడూ, నిర్మాతా, రచయితా. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఈయన ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటిస్తాడు. అక్కడ ఆయన్ను సూపర్ స్టార్, తలైవర్ అని అభిమానంతో పిలుచుకుంటారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన, విజయవంతమైన దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందాడు. అయితే ప్రస్తుతం 71 ఏళ్ల వయసులో ఉన్న రజనీ ఇప్పటికీ అదే స్టైల్‌తో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. రజనీ బాక్సాఫీస్ కింగ్ మరియు రికార్డ్ మేకర్ కూడా. దీంతో రజనీకాంత్‌కి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఇప్పటికీ నిర్మాతలు ముందుకు వస్తున్నారు.
ప్రస్తుతం, నటుడు రజనీకాంత్ ఆసియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు. అయితే రజనీకాంత్ అన్‌టోల్డ్ లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం సూపర్ స్టార్ ప్రేమ కథ వైరల్ అవుతోంది. రజనీకాంత్ చాలా మంది స్టార్ హీరోయిన్లతో నటించారు. ఆయనతో నటించి చాలామందిస్టార్ హీరోయిన్లుగా మారారు. అయితే ఆయనతో మాత్రం శ్రీదేవి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని చాలా బాగుండేదట. వీరిద్దరూ కలిసి తమిళం, తెలుగు, కన్నడ, హిందీ అనే 4 భాషల్లో 19 సినిమాల్లో నటించారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహిం ఉండేది. అయితే శ్రీదేవికి తెలియకుండా. ఒకానొక సమయంలో రజనీకాంత్ శ్రీదేవిపై పిచ్చి ప్రేమ పెంచుకున్నారట.
శ్రీదేవి ప్రేమించడంతో పాటు.. పెళ్ళాడాలని కూడా ఆయన అనుకున్నారట. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లితో కూడా రజనీ చెప్పారట. ఆమెతో సూపర్ స్టార్ బాగా క్లోజ్ గా ఉండేవారట. అయితే శ్రీదేవి కంటే 13 ఏళ్ళు పెద్దవాడు కావడంతో.. వీరి పెళ్ళిపై శ్రీదేవి తల్లి ఆలోచించారని సమాచారం. మంచి బంధం ఉంది. తనకంటే 13 ఏళ్లు చిన్నవాడు కావడంతో శ్రీదేవికి ఎంతో రక్షణగా ఉండేవాడు. చివరికి శ్రీదేవితో ప్రేమలో పడటం మొదలుపెట్టాడు. అలాగే శ్రీదేవికి 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రజినీ తన తల్లిని పెళ్లి చేసుకోమని అడిగాడు.
రజనీ శ్రీదేవిని పిచ్చిగా ప్రేమిస్తున్న సమయంలో శ్రీదేవి రజనీని ప్రేమిస్తుందో లేదో తెలియదు.. ఒకసారి కె.బాలచందర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవిని రజనీ ఎంతగానో ప్రేమిస్తున్నాడని, అందుకే ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేయాలని చూశాడట. అని చెప్పారట. శ్రీదేవి గృహప్రవేశ వేడుకకు రజనీ, నేనూ వెళ్లాం. మేము అతని ఇంటికి చేరుకోగానే కరెంటు పోయింది. ఇల్లంతా చీకటిగా ఉంది. దీన్ని చెడ్డ శకునంగా తీసుకున్న రజనీకాంత్ తన పెళ్లి గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా నిరాశతో వెనుదిరిగారు. అన్నారు.